Free Power: తెలంగాణలో విద్యాసంస్థలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక మీదట అన్ని విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్‌ను ఇస్తామని ప్రకటించింది. టీచర్స్ డే సందర్భంగా ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించి ఇంధనశాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్ ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్‌కు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ఉన్న మొత్తం అన్ని విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ వెంటనే అమలు చేస్తామని మంత్రి భట్టి తెలిపారు. తెలంగాణలో ఉన్న విద్యా సంస్థల జాబితాను తయారు చేయాలని విద్యాశాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.
educational institutions
Bandh : 4న దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్
Bandh Of Educational Institutions : పేపర్ లీకేజీ (Paper Leakage) లను నిరసిస్తూ జులై 4న దేశ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు ఎస్ఎఫ్ఐ (AISF), ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ వంటి వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. బంద్‌కు అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు సహకరించాలని కోరాయి. నీట్, నెట్ పేపర్ లీకేజీలకు నిరసనగా దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
పరీక్షల నిర్వహణలో విఫలమైన ఎన్టీఏ (NTA) ను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు పట్టుబడుతున్నాయి. ఇవే డిమాండ్లతో జులై 4న దేశ వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. ఇదిలా ఉంటే నీట్ అక్రమాలను నిరసిస్తూ మంగళవారం విద్యార్థి సంఘాలు పార్లమెంట్ మార్చ్ చేపట్టనున్నట్లు సమాచారం.
Also read: టీటీడీ ఈవో కీలక ఆదేశాలు..ఇక నుంచి ఆ కష్టాలు తీరినట్లే!
తెలంగాణకు రెడ్ అలర్డ్.. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు
మరోవైపు లోతట్టు ప్రాంత కాలనీల్లో నీళ్లు నిలవడంతో స్థానిక కాలనీ వాసులు ఇబ్బందులకు గురౌతున్నారు. గత వారంరోజులుగా నీరు నిల్వ ఉండటంతో దోమలు (Mosquitoes) వస్తున్నట్లు సరూర్ నగర్ పరిధిలోని కాలనీవాసులు తెలిపారు. దీంతో తాము అనేక రోగాల (Diseases) భారిన పడే అవకాశం ఉందని, అధికారులు వరద నీటిని తొలగించాలని వారు కోరుతున్నారు. అంతే కాకుండా వరదనీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో డ్రైనేజీలు సైతం పొంగి పొర్లుతుండటంతో దుర్వాసనను భరించలేక పోతున్నామంటున్నారు. నిత్యవసర వస్తువులు తెచ్చుకోవడానికి కూడా తాము ఇంటి నుంచి బయటకు రాలేకపోతున్నామని, బయటకు వస్తే జారి ఎక్కడ పడిపోతామో తెలియని పరిస్థితి ఉందని వాపోయారు. తమ పిల్లలు సైతం వరద నీటి గుండానే స్కూళ్లకు వెళ్లాల్సి వస్తోందని కాలనీవాసులు తెలిపారు.
రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతారణ కేంద్రం (Hyderabad Meteorological Centre) తెలిపింది. హైదరాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి, ఖమ్మం, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో నేడు రేపు 204 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదయ్యే అవకాశం ఉందనిహెచ్చరించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్లనుంచి బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంత ప్రజలు, ఇప్పటికే నీరు నిల్వ ఉన్న కాలనీ వాసులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ (ghmc) ఇప్పటికే చర్యలు కూడా చేపట్టింది.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాటు రానున్న మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలపడంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం బుధ, గురువారులు రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల(Educational institutions)కు సెలవులు ప్రకటించింది. దీంతో పాటు ఐటీ ఉద్యోగులకు సైతం పలు సూచనులు చేసింది. నగరంలోని ఉద్యోగులు మూడు విభాగాల్లో లాగౌట్ (Logout) చేయాలని సూచనలు చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు, సాయంత్రం 5 గంటలకు, రాత్రి 7 గంటలకు లాగౌట్ చేయాలని, ఈ విధంగా ఐటీ సంస్థలు (IT organizations) చర్యలు తీసుకోవాలని తెలిపింది. దీంతో నగరంలో ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది.