ECIL Recruitment 2023 : ఇంజీనిరింగ్ అండ్ డిప్లొమా పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థలకు ఈసీఐఎల్ గుడ్ న్యూస్ చెప్పింది. తమ సంస్థలో వివిధ ఖాళీలను భర్తి చేయబోతున్నట్లు తెలుపుతూ నోటిఫికేషన్ విడుదలచేసింది. అసక్తిగల అభ్యర్థులు మరో రెండు వారాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ఈ మేరకు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) 363 గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటీస్ (GEA), డిప్లొమా/టెక్నీషియన్ అప్రెంటీస్ (TA) పోస్ట్ ల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 363 అప్రెంటిస్ పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు. వాటిలో 250 పోస్ట్ లు గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటీస్ (GEA)లకు, 113 పోస్ట్ లు డిప్లొమా/టెక్నీషియన్ అప్రెంటీస్ (TA) లకు రిజర్వ్ చేశారు. ఈ రెండు కేటగిరీల అప్రెంటిస్షిప్ ఒక సంవత్సరం పాటు ఉంటుంది.
Also read :ఆయనతో కిస్ సీన్స్ అంటేనే చెమటలు పట్టేస్తాయి.. అయినా మూడు సినిమాలు చేశా: తనుశ్రీదత్తా
విద్య అర్హతలు:
గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటీస్ (GEA) పోస్ట్ లకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా AICTE-ఆమోదిత కళాశాల లేదా గుర్తింపు పొందిన భారతీయ విశ్వవిద్యాలయం నుంచి నాలుగు సంవత్సరాల బీఈ (B.E) లేదా బి.టెక్ (B.Tech) పూర్తి చేసి ఉండాలి. అలాగే డిప్లొమా/టెక్నీషియన్ అప్రెంటీస్ (TA) లకు అప్లై చేసే అభ్యర్థులు ఏప్రిల్ 1, 2021 నాటికి సంబంధిత కోర్సుల్లో డిగ్రీ లేదా మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఆసక్తిగల అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ లను ఆన్ లైన్ లో డిసెంబర్ 15 వరకూ సబ్మిట్ చేయాలి. పోస్ట్ లకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 25 సంవత్సరాలు మించకూడదు.
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ సంప్రదించండి – https://www.mysarkarinaukri.com/en/ecil/