హైదరాబార్‌లో విషాదం చోటుచేసుకుంది. అత్తాపూర్ సులేమాన్ నగర్లో తాజాగా ఈ ఘటన కలకలం రేపుతోంది. ఫైనాన్షియర్ వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్యాన్‌నుకు ఉరి వేసుకొని బలవన్మరణంకు తౌఫిక్ అనే యువకుడు పాల్పడ్డాడు. అంతేకాదు తౌఫిక్‌ను రౌడీ షీటర్లతో బెదిరింపులకు గురి చేశారు ఫైనాన్షియర్స్ వహీద్, షకీల్. డబ్బులు ఇవ్వకపోవడంతో తౌఫిక్‌ను ఇంట్లో నుండి తీసుకొని వెళ్లి చితకబాదిన రౌడీ షీటర్స్. భయంతో ఇంటికి వచ్చి ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న బాధితుడు.
నిన్న (గురువారం) సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు.కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫైనాన్షియల్ రౌడీషీటర్లతో దాడి చేయించడంతో వారిపై కూడా కేసు నమోదు చేశారు. రౌడీ షీటర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
వరుస ఘటనలు
ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతూనే ఉన్నాయి. నిన్న జరిగిన ఘటన మర్వక ముందే మరో ఘటన చోటుచేసుకుంటున్నాయి. నిన్న అప్పుల బాధను భరించలేక మండల కేంద్రంలోని గవరవీధికి చెందిన మళ్ల శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిన్న గురువారం జరిగిన జరిగింది. శ్రీనివాసరావు గ్రామంలో టెంట్ హౌస్ కోసం కొంత అప్పులు చేశాడు.చేసిన అప్పులు చెల్లించలేక మనస్తాపానికిలోనై రెండు క్రితం(బుధవారం) సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్.కోట సీహెచ్‌సీకి, అక్కడి విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. భార్య వరలక్ష్మి ఫిర్యాదు మేరకు హెచ్‌సీ ఎస్.కొండబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అప్పుల బాధతోనే..
మహబూబాబాద్ జిల్లా నడివాడలో అప్పుల బాధతో పెదగాని ఉపేందర్ అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు పెదగాని ఉపేందర్‌కు పొలంలో రెండేండ్లుగా సాగు చేస్తున్నాడు. పంటకు గిట్టుబాటు ధర రాక అప్పులు పాలయ్యాడు. దీనికి తోడు ఇల్లు కట్టేందుకు కొంత అప్పు చేశాడు. ప్రైవేట్ చిట్టీల పేరిట రూ.2 లక్షలు పోయ్యాయి. మొత్తం రూ.10లక్షలకు పైగా అప్పు అయిందని మనస్తాపానికి గురైన ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు ఉపేందర్. ఆసుపత్రితో చికిత్స పొందుతూ మృతి చెందాడు.