దుబాయ్ యువరాణి షైకా మహ్రా మొహమ్మద్ రషీద్ అల్ మక్తూమ్.. తన భర్త షేక్ మనా బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటన చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ దంపతులకు మొదటి సంతానం కలిగిన తర్వాత కేవలం రెండు నెలల్లోనే విడాకుల ప్రకటన రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇన్‌స్టాలో షేకా మహ్రా ఇలా రాసుకొచ్చారు. ‘ ప్రియమైన భర్తకు.. మీరు ఇతరుల సహచర్యం కోరుకోవడం వల్ల మీకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఐ డైవర్స్ యూ. టేక్ కేర్.. మీ మాజీ భార్య అంటూ’ పేర్కొన్నారు.
View this post on Instagram
Also Read: రామసేతును రాముడే కట్టడా ? సహజంగా ఏర్పడిందా ?
ఇదే సమయంలో ఈ దంపతులిద్దరూ కూడా ఇన్‌స్టాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. కలిసి దిగిన ఫొటోలు డిలీట్ చేసుకున్నారు. ప్రస్తుతం వీళ్ల విడాకుల ప్రకటన సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఒకరినొకరు బ్లాక్ చేసుకున్నారని కొందరు కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు మాత్రం షైకా మహ్రా ఇన్‌స్టా అకౌంట్ హ్యాక్ అయ్యిందని చెబుతున్నారు. మరికొందరు ఇది సాహసోపేతమైన నిర్ణయమంటూ ప్రశంసిస్తున్నారు.
Also read: అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి భార్య ఉషా చిలుకూరి.. ఏపీలో మూలాలు!