Double Ismart Count Down Starts : డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. ప్రస్తుతం మూవీ టీమ్ అంతా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ మధ్య ముంబై లో ప్రధాన పాత్రలకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ సూపర్బ్ రెస్పాన్స్ అందుకుంది. మొదట ఈ సినిమాని మార్చ్ 8 న రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ షూటింగ్ ఆలస్యం వల్ల వాయిదా వేశారు.
రీసెంట్ గా పుష్ప 2 రిలీజ్ డిసెంబర్ కి పోస్ట్ పోన్ అవ్వడంతో.. ఆ సినిమా రిలీజ్ డేట్ అయిన ఆగస్టు 15 న రామ్ డబుల్ ఇస్మార్ట్ గా థియేటర్లో సందడి చేయబోతున్నాడు.ఈ క్రమంలోనే రిలీజ్‌కు 50 రోజులు ఉండడంతో కౌంట్ డౌన్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు షూటింగ్ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో టైటిల్ సాంగ్‌ను షూట్ చేస్తున్నారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు.
మణిశర్మ కంపోజ్ చేసిన ఎనర్జిటిక్ మాస్ సాంగ్ చార్ట్ బస్టర్ అవబోతోందని, అలాగే రామ్ సిగ్నేచర్ డ్యాన్స్ మూమెంట్స్‌తో విజువల్ ట్రీట్‌గా ఈ పాట ఉండబోతోందని మేకర్స్ చెబుతున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, చార్మి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది.
Bringing MASS GALLI CINEMA to every Galli in 50 more days ❤️🔥
Ustaad @ramsayz will blast the screens as #DoubleISMART Shankar 🤙
Grand Worldwide Release on AUGUST 15th, 2024 💥
A #PuriJagannadh Film @duttsanjay @KavyaThapar @IamVishuReddy @PuriConnects @adityamusic pic.twitter.com/T3aBtbrCnV
— Charmme Kaur (@Charmmeofficial) June 26, 2024