Ambedkar Abhaya Hastam: దళితబంధు ప్లేస్లో అంబేద్కర్ అభయహస్తం అమలు చేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది. ఈ పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.12 లక్షలు ఇవ్వనుంది. దీనిపై కసరత్తు మొదలు పెట్టింది. త్వరలోనే కొత్త గైడ్లైన్స్ రానున్నాయి. కలెక్టర్ల ఆధ్వర్యంలో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. గత ప్రభుత్వంలో అనర్హులకు, బీఆర్ఎస్ వాళ్లకు దళితబంధు (Dalit Bandhu) ఇచ్చారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. 10 లక్షల్లో ఎమ్మెల్యేలే సగం తీసుకున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈసారి పకడ్బంధీగా పథకం అమలుకు ప్రణాళికలు రూపొందిస్తోంది ప్రభుత్వం. వయసు, ఆదాయం, ఆస్తి పరిగణలోకి తీసుకుని లబ్ధిదారుడి ఎంపిక చేయనుంది.