Daggubati Abhiram Wedding: దగ్గుబాటి కుటుంబంలో పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. టాలీవుడ్ నిర్మాత దగ్గుబాటి సురేష్ చిన్న కుమారుడు అభిరామ్ వివాహం బుధవారం రాత్రి శ్రీలంకలో గ్రాండ్ గా జరిగింది. శ్రీలంకలో నిర్వహించిన డెస్టినేషన్ వెడ్డింగ్ కు ఫ్యామిలీ మెంబర్స్, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అభిరామ్ తన చిన్న తాత మనవరాలు ప్రత్యుష చాపరాలను వివాహం చేసుకున్నారు. ఆమె వరుసకు మరదలు అవుతుంది. శ్రీలంకలో సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ జంట మూడు బంధంతో ఒకటయ్యారు. పెళ్లి వేడుకల్లో సురేష్ బాబు, అభిరామ్, మాళవిక, రానా, మిహీక దంపతులు, నాగ చైతన్య, వెంకటేష్ చేస్తూ కనిపించారు.
Also Read:OTT Release: మూవీ లవర్స్‌ని కిక్కెక్కించే సినిమాలు.. ఓటీటీలో కొత్త రిలీజ్లు ఇవే!
శ్రీలంకలో పెళ్లి వేడుకలు పూర్తయిన తర్వాత.. హైదరాబాద్ తిరిగి రానున్నారు. త్వరలోనే హైదరాబాద్ లో సినీ ప్రముఖులు, ఇండస్ట్రీ సన్నిహితుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం వీరి పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అభిరామ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో హీరోగా ‘అహింస’ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.
Best wishes and hearty congratulations to Abhiram Daggubati🎉🎉 https://t.co/NxwIKbHoP0 pic.twitter.com/wUMxXe6igy
— Nagaraja Reddy (@NagarajaReddyS) December 7, 2023
Also Read: Daggubati Abhiram’s wedding: శ్రీలంకలో ఘనంగా దగ్గుబాటి అభిరామ్ పెళ్లి సంబరాలు