Fake Notes : పెళ్లి(Marriage) చేసుకోబోతున్న నూతన దంపతులకు కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, బంధువులు బహుమతులు ఇవ్వడం సహజం. అయితే కొన్నిసార్లు కొత్త జోడీ సైతం ఒకరికొకరు ఖరీదైన గిఫ్ట్ లు(Costly Gifts) ఇచ్చుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిలను ఇంప్రెస్ చేసేందుకు అబ్బాయిలు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. అయితే ఇటీవల
చైనా(China) లో ఓ యువకుడు తన ప్రియురాలు కుటుంబాని ఊహించని షాక్ ఇచ్చాడు.
రూ.80 లక్షల నగదు..
ఈ మేరకు ఆసక్తికరమైన స్టోరీ వివరాల్లోకి వెళితే.. పెళ్లికి ముందు యువతికి ఫ్లాట్ కొనివ్వాలని అమ్మాయి తల్లిదండ్రులు షరతు విధించారు. అయితే దీనికి అంగీకరించిన సదరు యువకుడు.. కాబోయే భార్య కోరికను ఎలాగైనా నెరవేర్చాలనే తపనపడ్డాడు. ఈ క్రమంలో రూ.80 లక్షల నోట్లను యువతి ఫ్యామిలీకి అందించాడు.
ఇది కూడా చదవండి: TS News: కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్.. కుండ బద్దలు కొట్టిన కేంద్ర మంత్రి!
అయితే ఆ నగదును బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు యువతి వెళ్లగా అసలు బాగోతం బయటపడింది. నోట్లకట్టల్లో మొదట కొన్ని నోట్లు అసలైనవి పెట్టి మిగతావన్నీ నకిలీ నోట్లతో నింపేశాడట. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన బ్యాంక్ సిబ్బంది, సదరు యువతి వెంటనే పోలీసులను ఆశ్రయించగా అతన్ని అుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుండగా.. ఫన్నీ కామెంట్స్ పేలుతున్నాయి.