Dog Jumped from 5th Floor: కోతులు ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకు.. ఆ చెట్టు నుంచి ఈ చెట్టు మీదకు దూకడం సహజంగానే మనం చూస్తుంటాం. ఇక కుక్కలు(Dog) కూడా అంత పెద్ద జంపింగ్స్ కాకపోయినా.. చిన్న చిన్న కాలువలు దూకడం చేస్తుంటాం. గోడ పై నుంచో.. చిన్న మట్టి గడ్డ మీద నుంచో దూకుతుంటాయి కుక్కలు. మరి ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు అంతస్తుల భవనం పై నుంచి దూకేసింది. ఇంత ఎత్తు నుంచి దూకిన కుక్క ఇతక బతికి ఉంటుందని అనుకోగలమా? ఛాన్సే లేదు. సాధారణంగా ఒకటి రెండు ఫ్లోర్ల నుంచి దూకితేనే, కాళ్లు, చేతులు విరిగిపోతాయి. ఇక తలకు బలంగా తగిలితే ప్రాణాలే పోతాయ్. కానీ, ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ఎవరూ ఊహించని రీతిలో ఆ కుక్కకు చిన్న గాయం కూడా అవలేదు. ఏ ధైర్యంతో ఆ కుక్క కిందకు దూకిందో గానీ.. కింద పడిన తరువాత నేరుగా పైకి లేచి సాధారణ స్థితిలోనే నడచుకుంటూ వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసి నెటిజన్లే షాక్ అవుతున్నారు.
ఇంతకీ వీడియోలో ఏముందో ఓసారి తెలుసుకుందాం..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో నిర్మాణం దశలో ఉన్న భారీ బిల్డింగ్ ఉంది. దాని పైన 5వ అంతస్థులో ఓ కుక్క ఉంది. మెట్ల మార్గం ద్వారా ఐదవ అంతస్తుకు చేరుకున్న కుక్క.. అటూ ఇటూ తిరుగుతూ కాసేపు సందడి చేసింది. ఇంతలో స్లాబ్ చివరకు వచ్చి.. కిందకు చూసింది. ఏం చేస్తుందా అని ఆలోచించే లోపే.. ఆ కుక్క నేరుగా కిందకు దూకేసింది. నల్లరంగులో ఉన్న ఆ కుక్క బిల్డింగ్ పై నుంచి నేరుగా కిందకు దూకేసింది. ఆ కుక్క పడిన తీరు చూస్తే.. దాని ప్రాణాలు పోయే ఉంటాయని అనుకుంటారు. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. 5వ అంతస్తు నుంచి కిందకు దూకేసిన కుక్క.. తాపీగా పైకి లేచి తన దారిన తాను ఒయ్యారాలు ఒలకబోస్తూ నడచుకుంటూ వెళ్లింది. ఆ కాసేపటికే దాని వెనుక మరో కుక్క కూడా వచ్చేసింది.
Dog continues walking normally after jumping from 5th floor pic.twitter.com/flPLZxDiVi
— Crazy Clips (@crazyclipsonly) October 18, 2023
ఇదికూడా చదవండి: విడాకులు తీసుకున్న కూతురికి ఘనంగా స్వాగతం తెలిపిన తండ్రి.. వీడియో వైరల్..
ఈ సీన్‌ను పక్క బిల్డింగ్‌లో ఉన్న వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. వీడియోను చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. కుక్కకు ఏమైనా అతీంద్రీయ శక్తులు ఉన్నాయా? అని పరేశాషాన్ అయ్యారు. కుక్క స్టంట్‌కు ఫిదా అయిపోయి రకరకాల కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.
ఇదికూడా చదవండి: దసరా పండుగకు ఊరెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. మరో 9 ప్రత్యేక రైళ్లు..