Surya Kumar Yadav Fit To Join MI: ఈసారి ముంబై ఇండియన్స్ పరిస్థితి అస్సలు ఏమీ బాలేదు. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడితే అన్నింటిలోనే ఓటమి మూటగట్టుకుంది. అది కూడా చాలా చెత్తగా ఆడి మరీ. ఇప్పటికి పెద్దగా నష్టమేమి లేకపోయినా…ఇదే కంటిన్యూ అయితే కనుక ముంబై టీమ్ నాకౌట్ దశలోనే వెనక్కు తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలాంటి టైమ్‌లో ముంబై టీమ్‌కు (Mumbai Indians) బూస్ట్ ఇచ్చే వార్త వచ్చింది. జట్టులోని స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చేస్తున్నాడని చెబుతున్నారు. కాలి మడమ, స్పోర్ట్స్ హెర్నియా ఆపరేషన్లు జరిగిన తర్వాత దాని నుంచి కోలుకున్నాడని..త్వరలోనే జట్టులోకి వస్తాడని చెబుతున్నారు. బెంగళూరు జాతీయ అకాడమీ వైద్యులు సూర్యకు ఫిట్నెస్ క్లియరెన్స్ ఇచ్చారని తెలుస్తోంది.
ఇంకా ఒక పరీక్ష పాసవ్వాలి..
అయితే సూర్య ఇంకా ఒక ఫిట్ నెస్ టెస్ట్ మాత్రం పాస్ కావాల్సి ఉంది. అది కూడా క్లియర్ అయిపోతే ఏప్రిల్ 7న ముంబై ఆడబోయే మ్యాచ్‌కు అతను ఆడేందుకు ఎన్సీఏ నుంచి అనుమతి లభిస్తుంది. ఒకవేళ 7వ తేదీన ఆడకపోయినా ఏప్రిల్ 11వ తేదీ మ్యాచ్‌కు మాత్రం కచ్చితంగా టీమ్‌లో చేరతాడని అంటున్నారు. అతను సౌకర్యవంతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు అని ఓ బీసీసీఐ ప్రతినిధి తెలిపారు. జూన్ 1న ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో సూర్య విషయంలో బీసీసీఐ (BCCI) జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.
Also Read:Telangana: కొమురం భీం జిల్లాలో ఏనుగు భీభత్సం..ఇద్దరు రైతులు మృతి