CM Revanth Reddy: విద్యుత్ అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఆగ్రహించినట్లు తెలుస్తోంది. సోమవారం నుంచి తెలంగాణలో పూర్తిగా అంధకారం నిండేలా కేసీఆర్ ప్లాన్ చేసి వెళ్ళారంటూ అధికారులపై ఆయన విరుచుకుపడినట్లు సమాచారం. కేసీఆర్ (KCR) రూ. 85వేల కోట్లు అప్పు చేసి విద్యుత్ రంగాన్ని బకాయిల్లో దింపేశారని, సోమవారం నుంచి విద్యుత్ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్రలకు కేసీఆర్ తెగబడ్డారంటూ ఆయన అసహనం వ్యక్తంచేశారు.
ఇది కూడా చదవండి: 24 గంటల కరెంట్ ఇవ్వడం మా గ్యారెంటీ – శ్రీధర్ బాబు
వాళ్ల రాజీనామాలు ఆమోదించొద్దు:
విద్యుత్ శాఖ సీఎండీలు, అధికారుల రాజీనామాలను ఆమోదించడానికి వీల్లేదని, విద్యుత్ రంగంపై శుక్రవారం నిర్వహించే సమీక్ష సమావేశానికి వారంతా ఎట్టి పరిస్థితుల్లో హాజరు కావాల్సిందేనని సీఎం ఆదేశించారు. విద్యుత్ కొనుగోళ్లపై పూర్తి వివరాలుతో రావాలన్నారు. అధికారులకు అందరికీ నోటీసులిచ్చి సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.