అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన మూడు రాష్ట్రాల్లో సీఎం అభ్యర్ధులు ఎవరో ఇంకా తేలలేదు. ఇందులో రాజస్థాన్ సీఎంగా ముగ్గరు, నలుగురు పేర్లు తెరమీదకు వచ్చాయి. వారిలో బాబా బాలక్ నాథ్ సీఎం అవుతారంటూ చాలా బంగా వినిపించింది. అయితే తాజాగా తనంతట తానే తాను సీఎం రేసులో లేనంటూ బాబా అనౌన్స్ చేశారు. ఇంతకాలం రేస్ లో ఉండి ఇప్పుడు సడెన్ గా అందులో నుంచి తప్పించడానికి కారణాలు ఏంటా అని ఆరా తీస్తున్నారు అందరూ. అయితే దీనికి ప్రధానంగా మూడు కారణాలు చెబుతున్నారు విశ్లేషకులు.అవేంటో ఇప్పుడు చూద్దాం.
రాజస్థాన్ సీఎం సర్వేల్లో అత్యధికంగా వినిపించిన పేరు బాబా బాలక్ నాథ్. బీజేపీ నేతలు అమిత్ షా, జేపీ నడ్డాలు కూడా అతనితో సమీవేశమయ్యారు. కానీ ఇప్పుడు మాత్రం సీఎం రేసులో లేరని దాదాపు కన్ఫార్మ్ అయ్యారు. దీనికి మొదటి కారణం…ఆయన సామాజిక వర్గం. బాబా బాలక్ నాథ్ ఓబీసీ వర్గానికి చెందినవారు. రాజస్థాన్ పక్క రాష్ట్రమైన మధ్యప్రదేశ్ లో కూడా సీఎం పదవికి ఓబీసీ వ్యక్తినే నియమించే అవకాశం ఉంది. దీంతో ఒకే సారి రెండు రాష్ట్రాల్లో ఓబీసీ ముఖ్యమంత్రులను చేసేందుకు పార్టీ అధిష్టానం సిద్ధంగా లేదు. లోకసభ ఎన్నికల నేపథ్యంలో ఈ స్ట్రాటజీ అంత మంచిది కాదని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారు.
Also Read:ప్రజా దర్బార్ కు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
బాబా సీఎం రేసులో నుంచి తప్పుకోవడానికి రెండవ కారణం..అనుభవ లేమి. బాబా బాలక్ నాథ్ వయసు చాలా చిన్నది. అతను ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే ఎంపీ, ఎమ్మెల్యే అయ్యారు. మొత్తం కలిపితే బాబా రాజకీయ అనుభవం ఐదేళ్ళే. ఎంత ప్రజాభిమానం ఉన్నా…తెలివి తేటలున్నా..ఇంత తక్కువ రాజకీయ అనుభవంతో సీఎం పదవి చేట్టడం అంటే అదీ రాజస్థాన్ లాంటి ఒక పెద్ద రాష్ట్రానికి కొంచెం కష్టమైన విషయమే. ఇది బీజేపీ పెద్దలను కూడా ఆలోచింపజేసిన విషయం. దీన్ని దఈష్టిలో పెట్టుకుని కూడా అతన్ని సీఎం రేసు నుంచి తప్పించారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక మూడవది…చాలా ముఖ్యమైన కారణం, బాలక్ నాథ్ బాబా కావడం. ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ కు యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. బీజేపీకి ఇప్పటికే బలంగా హిందూత్వ ముద్ర ఉంది. ఇప్పుడు రాజస్థాన్ కు కూడా బాబాను సీఎం చేస్తే అది వ్యతిరేకతకు దారి తీయొచ్చనే బెంగ ఉంది అధిష్టానానికి. అన్ని వర్గాలను అభివృద్ధి చేస్తామని చెబుతూ ఇలా యోగులను, బాబాలను సీఎం చేస్తూ పోతే మొదటికే మోసం వస్తుంది అనుకుంటున్నారు బీజేపీ పెద్దలు. తాము ఇచ్చిన హామీలకు విలువ లేకుండా పోతుందని ఆలోచిస్తున్నారు. అందుకే బాబా బాలక్ నాథ్ ను సీఎం కుర్చీకి దూరం చేసి ఉంటారని విశ్లేషకులు చెబుతున్నారు.