Twitter : ట్విట్టర్(X) లో ఎక్కడ చూసినా ఇప్పుడు ‘Click Here‘ పదమే కనిపిస్తోంది. ముఖ్యంగా రాజకీయ పార్టీలు(Political Parties) క్లిక్ హియర్ అంటూ తెగ పోస్టులు పెడుతున్నాయి. ఒకరి నుంచి చూసి మరొకరు పోస్టులు పెడుతున్నారు. అటు సెలబ్రెటిలు(Celebrities) సైతం ఇదే యూజ్ చేస్తున్నారు. ఈ ‘క్లిక్ హియర్’ అని పోస్టు పెట్టిన పార్టీల్లో టీడీపీ, కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీలు కూడా ఉన్నాయి. దీంతో అసలేంటి క్లియర్ హియర్ అన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
— Telugu Desam Party (@JaiTDP) March 30, 2024
రాజకీయ పార్టీలు, స్పోర్ట్స్ క్లబ్‌లు, ఫుట్‌బాల్ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారితో సహా వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో అనేక మంది ప్రముఖ వ్యక్తులు తమ సందేశాలను తెలియజేయడానికి ఈ క్లిక్ హియర్ ట్రెండ్‌లో పాల్గొంటున్నారు. ఇంతలో, ALT టెక్స్ట్ ఫీచర్‌ని ఉపయోగించి మీమ్‌ని క్రియేట్ చేస్తున్నారు. కొంతమంది వినియోగదారులు ఈ పోస్టులను విమర్శిస్తున్నారు. ఇది దృష్టిలోపం ఉన్న కమ్యూనిటీకి అగౌరవంగా ఉందని ఆరోపిస్తున్నారు.
— Congress (@INCIndia) March 30, 2024
ఇది ఎలా క్రియేట్ చేయాలి?
–> ముందుగా మీ ట్విట్టర్ అకౌంట్‌ను ఓపెన్ చేయండి.
–> టాప్‌లో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అని ఉంటుంది.
–> ఫస్ట్ మీకు ఇమేజ్ యాడ్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది.
–> అక్కడ మీరు ఈ క్లిక్ హియర్ ఇమేజ్‌ని సెలక్ట్ చేసుకోవాలి.
–> ఆ తర్వాత ఇమేజ్ కింద ట్యాగ్, డిస్క్రిప్షన్ అనే ఆప్షన్ ఉంటుంది.
–> డిస్క్రిప్షన్ సెలక్ట్ చేసుకోండి.
–> పైన మీకు Alt అని చూపిస్తూ ఉంటుంది.
–> ఆ తర్వాత డిస్క్రిప్షన్ ఇవ్వండి.
–> రైట్ కార్నర్లో సేవ్ అని ఉంటుంది.
–> సేవ్ చేసిన తర్వాత పోస్ట్ చేయాలి.
–> పోస్ట్ చేసిన తర్వాత ఇమేజ్‌కి లెఫ్ట్ సైడ్ కార్నర్లో Alt అని కనిపిస్తూ ఉంటుంది.
–> అది క్లిక్ చేస్తే మీరు పెట్టిన డిస్క్రిప్షన్ కనిపిస్తుంది.
— RTV (@RTVnewsnetwork) March 31, 2024
Also Read : 155.5KM.. టీమిండియా స్పీడ్ సెన్సేషన్.. ఎవరీ మయాంక యాదవ్?