లోకనాయకుడు కమల్ హాసన్, లెజెండ్ డైరక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా ‘ఇండియన్ 2’. రెండు దశాబ్దాల నాటి బ్లాక్ బస్టర్ భారతీయుడు సినిమాకు సీక్వెల్ ఇది. ఐకానిక్ ‘సేనాపతి’ పాత్ర మరోసారి ఇండియన్-2 రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పుడీ సినిమాకు రిలీజ్ డేట్ దాదాపు లాక్ అయింది.
గతంలో ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందని వార్తలు వచ్చాయి. అయితే రెండు పార్ట్‌ల రిలీజ్‌ని కాన్సిల్ చేసిన టీమ్, ఇప్పుడు ఒక భాగంగానే రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగా ఇండియన్-2 సినిమాకు విడుదల తేదీ ఖరారు చేసినట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా, 2024 ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజ్ అవుతుంది.
కమల్ హాసన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది ఇండియన్-2. ఇందులో కమల్ సరసన కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. మరో కీలక పాత్రలో రకుల్ ప్రీత్ కనిపించనుంది. బాబీ సింహా, సముద్రఖని, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పార్ట్-1లో తండ్రికొడుకులుగా నటించాడు కమల్. పార్ట్-2లో మాత్రం సినిమా మొత్తం సేనాపతి పాత్ర చుట్టూ తిరుగుతుంది.
ఇదే తొలిసారి.
ఇండియన్-2కి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. 2 దశాబ్దాల తర్వాత ఓ సినిమాకు సీక్వెల్ రావడం ఇదే తొలిసారి. గమ్మత్తైన విషయం ఏంటంటే, ఈ మూవీ తర్వాత శంకర్, తన సినిమాను తానే రీమేక్ చేయబోతున్నాడు. అదే అపరిచితుడు. హిందీలో రణ్వీర్ సింగ్ హీరోగా అపరిచితుడు సినిమా రీమేక్‌ను స్టార్ట్ చేస్తాడు శంకర్.