Children Birth: చాలా మంది కొన్ని గడియల్లో పుడితే అదృష్టంగా భావిస్తారు. గ్రహాల స్థితిగతుల ఆధారంగా పండితులు శుభగడియలు చెబుతుంటారు. అంతేకాకుండా పుట్టిన సమయం ఆధారంగా రాశులు, ఆ తర్వాత వారి భవిష్యత్‌ను అంచనావేసి జాతకం చెబుతుంటారు. పిల్లల్లో చాలా మంది తెలివైన వారు, కొందరు తక్కువగా ఆలోచించేవారు ఉంటారు. అంతేకాకుండా అసలు తెలివి లేనివాళ్లు కూడా ఉంటారు. కొందరు పిల్లలకు పుట్టినప్పటి నుంచే బాగా తెలివితేటలు ఉంటే మరికొందరికి పెరుగుతున్న కొద్దీ వస్తాయి.
అయితే రాత్రి సమయంలో జన్మించిన వారు ఇతర టైమ్లలో పుట్టినవారి కంటే ఎక్కువగా తెలివితేటలతో పుడతారని పండితులు అంటున్నారు. పలువురు చిన్నారులపై సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో కూడా ఈ విషయం స్పష్టమైంది. పిల్లలు జన్మించిన టైమ్, వారి చదువులు, పరిజ్ఞానం వంటి అంశాలపై పరిశోధనలు చేశారు. ఇతర సమయాల్లో పుట్టిన పిల్లల కంటే రాత్రి పుట్టినవారే ఎక్కువ జ్ఞానవంతులు అని చెబుతున్నారు. అలాగే వారికి ఐక్యూలెవల్స్ కూడా బాగా ఉంటాయట.
రాత్రి సమయంలో జన్మించిన వారిలో తెలివితో పాటు సమస్యలను పరిష్కరించే సామర్థ్యం బాగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అన్ని రంగాల్లో బాగా రాణిస్తారని, గొప్ప గొప్ప ఉద్యోగాల్లో ఉండటారని చెబుతున్నారు. మామూలుగా అయితే రోజుకు 7 నుండి 8 గంటల నిద్ర అవసరం. కానీ వీళ్లకు మాత్రం 6 గంటల నిద్ర సరిపోతుందని,ఉదయం పుట్టినవారికి ఎక్కువ నిద్ర అవసరం అని శాస్త్రవేత్తలు వెల్లడించారు. పనుల్లో చురుగ్గా వ్యవహరించడం. ఎక్కువ పని చేయడం చేస్తారని అంటున్నారు. మరో విషయం ఏంటంటే తెలివి ఎక్కువగా ఉన్న పిల్లల్లో మానసిక రుగ్మతలు, ఆందోళన, ఒత్తిడి సైతం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: షాంపూలో కొంచెం ఉప్పు కలిపితే జరిగే అద్భుతాలు చూడండి
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.