Chennai: చెన్నైలోని ఓ అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి చిన్నారి సన్ షెడ్ పై పడిన ఘటన జనాలను ఉత్కంఠకు గురిచేసింది. అపార్ట్ మెంట్ రెండో అంతస్తులో ఉంటున్న పాప ఈరోజు ఉదయం అనుకోకుండా బాల్కనీ నుంచి సన్ షేడ్ పై పడిపోయింది. దీంతో ఎటు వెళ్లాలో తోచక ఇబ్బంది పడింది. వెంటనే గమనించిన పేరెంట్స్, ఇరుగుపొరుగు అలర్ట్ అయ్యారు. కొంతమంది కలిసి చిన్నారిని రక్షించగా ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Today morning in my cousins apartment in Chennai 😱 pic.twitter.com/VAqwd0bm4d
— 🖤RenMr♥️ (கலைஞரின் உடன்பிறப்பு) (@RengarajMr) April 28, 2024
ఈ మేరకు పాప కిందపడకుండా ముందుగా పెద్ద క్లాత్ తెచ్చి పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత పెద్ద జముకలం తీసుకొచ్చారు. ఈలోగా పాప కిందకు జారిపోతూవుంది. ఇంతలో కింద ఉన్న కొందరు తమ ఇంటి కిటికీలోంచి ఎక్కి చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ రెండో అంతస్తు నుంచి కూడా పైకి వచ్చి పట్టుకోలేకపోయాడు. అయితే పక్కనే ఉన్న మరో వ్యక్తి కిటికిలోంచి మరొకరిని ఎత్తుకోగా సదరు వ్యక్తి ఒంటిచేత్తో జారిపోతున్న పాపను జాత్రత్తగా పట్టుకుని కిందనున్నవాళ్లకు అందించాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. ప్రజల నుంచి అక్కడి స్థానికులు ప్రశంసలు అందుకుంటున్నారు.