FDA Approves Chikungunya Vaccine: చికున్‌గున్యా వల్ల జ్వరాలు, కీళ్ల నొప్పులతో చాలామంది బాధపడుతుంటారు. అయితే ఇలాంటివారికి త్వరలోనే ఉపశమనం కలగనుంది. ప్రపచంలో మొదటిసారిగా యూరప్‌కు చెందిన వాల్నేవా అనే కంపెనీ చికున్‌గున్యా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. అయితే ఈ టీకా వాడేందుకు అమెరికా ఆరోగ్య సంస్థ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) నుంచి కూడా ఆమోదం వచ్చేసింది. దోమల ద్వారా వ్యాపించే చికున్‌గున్యా వైరస్‌ను ఈ టీకా ద్వారా అడ్డుకోవచ్చని ఎఫ్‌డీఏ అధికారులు తెలిపారు. 18 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు దీనిని వినియోగించవచ్చని పేర్కొన్నారు. ఇక ఈ వైరస్ ప్రభావం ఉన్న దేశాల ప్రజలకు ఈ వ్యాక్సిన్‌ను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అయితే ‘లిక్స్‌చిక్’ అనే పేరుతో ఈ వ్యాక్సిన్‌ను మార్కెట్లో విక్రయించనున్నారు.
Also read: ఈరోజు వరల్డ్ సైన్స్ డే.. దీని ప్రాముఖ్యత ఏంటో తెలుసా.. ?
జ్వరం, తీవ్రమైన కీళ్ల నొప్పులను కలిగించే ఈ చికున్‌గున్యా ముఖ్యంగా ఆఫ్రికా, ఆగ్నేయాసియా, అమెరికాలోని ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాపిస్తుంది. గత 15 ఏళ్లలో చూసుకుంటే దాదాపు 5 మిలియన్లకుపైగా రోగులు ఈ వ్యాధి బారిన పడ్డారు. అలాగే ఈ వైరస్ కొత్త భౌగోళిక ప్రాంతాలకు కూడా వ్యాపించిందని.. అందుకే ఇది ప్రపంచవ్యాప్త వ్యాధిగా పేరొందినట్లు ఎఫ్‌డీఏ అధికారులు తెలిపారు. అయితే ఈ చికున్‌గున్యా వైరస్ (Chikungunya Virus) తీవ్రమైన వ్యాధని.. ఇది సోకినవారిలో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని పేర్కొన్నారు. ఈ వైరస్ వల్ల ముఖ్యంగా వృద్ధుల్లో ఎక్కవగా ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పారు.
Today, we approved the first chikungunya vaccine for individuals 18 years of age and older who are at increased risk of exposure to chikungunya virus. https://t.co/P0vN2yjZzW pic.twitter.com/rLqphefxpV
— U.S. FDA (@US_FDA) November 9, 2023
ఇక క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా నార్త్ అమెరికాలో 3,500 మందిపై ఈ వ్యాక్సిన్‌ను (Chikungunya Vaccine)పరీక్షించినట్లు వెల్లడించారు. అయితే ఈ వ్యాక్సిన్ వల్ల తలనొప్పి, అలసట, కండరాలు, కీళ్ల నొప్పులు, జ్వరం, వికారం లాంటి సాధారణ దుష్ప్రభావాలు వచ్చినట్లు అధికారులు చెప్పారు. కేవలం 1.6 శాతం మందిలో తీవ్రమైన దుష్ప్రభాబాలు కనిపించాయని.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని తెలిపారు.