Viral Video: నిత్యం రద్దీగా ఉండే చెన్నై రోడ్డులో ఓ అనుకోని సంఘటనతో వాహనదారులంతా అవాక్కయ్యారు. ఫుల్‌గా మందుకొట్టిన విదేశీయుడు అటుగా వెళ్తున్న బైకర్‌ను జాంబీ రేంజ్లో కొరికేశాడు. బాగా మద్యం సేవించి చొక్కా కూడా వేసుకోకుండా నడిరోడ్డుపై నానా హంగామా చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విదేశీయుడు రోడ్డుపై వింతగా ప్రవర్తించడంతో పోలీసులు, స్థానికులంతా కలిసి అతన్ని అడ్డుకున్నారు. రాయపేట ప్రాంతంలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో విదేశీయుడు వికృత చేష్టలతో రోడ్డుపై వెళ్తున్న వారిని భయాందోళనకు గురిచేశారు.
This Shameful zombie incident happened in Chennai..🧟♂️🧟♂️🧟♂️
A foreign National reportedly in an inebriated state, running around trying to bite commuters..😂😂😂#BREAKING_NEWS #RaghavChadha #earthquake #KapilSharma #Patanjali #ArvindKejriwal pic.twitter.com/5eN9oQD7Vc
— Ayesha (@Ayesha86627087) April 2, 2024
అక్కడికి చేరుకున్న పోలీసులు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. చివరికి ఓ గ్రిల్ దగ్గర అతన్ని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. వీడియో చూసిన నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఒకరు విదేశీయుడి ప్రవర్తనను జాంబీతో పోల్చారు. డ్రగ్స్ తీసుకున్నవారితో అప్రమత్తంగా ఉండాలంటూ పలువురు పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో డ్రగ్స్ సేవించి ఇలా వ్యవహరించేవారి పట్ల పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మరికొందరు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. ఆ వ్యక్తికి కనీసం సంకెళ్లు కూడా వేయకుండా తీసుకెళ్లారు. చెన్నై పోలీసుల దగ్గర సంకెళ్లు లేవా అంటూ ప్రశ్నిస్తున్నారు. అదే విదేశాల్లో భారతీయులు ఎవరైనా ఇలా ప్రవర్తిస్తే శిక్షలు కఠినంగా ఉండేవని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ఆస్పిరిన్ టాబ్లెట్ గుండెపోటు ప్రమాదాన్ని ఎంత వరకు తగ్గిస్తుంది?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.