Flights Delayed: చెన్నైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా చెన్నైలో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. 15 విమానాలు చెన్నైలో ల్యాండ్ కావడానికి ఇబ్బందులు ఎదురుకున్నాయి. నాలుగు విమానాలను బెంగళూరుకు పంపించారు. మొత్తంగా 31 విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడిందని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. భారీ వర్షల కారంణంగా చెన్నైలో విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు.