చిత్తూరు జిల్లా కుప్పంలో చెడ్డి గ్యాంగ్ హల్ చల్ చేసింది. పట్టణంలోని ఫిషర్స్ కాలనీ సమీపంలో ప్రవీణ్ ఇంట్లో బుధవారం రాత్రి 10:30 గంటల సమయంలో చెడ్డి గ్యాంగ్‌కు చెందిన ముగ్గురు దొంగతనానికి ప్రయత్నం చేయగా.. ఇంటి యజమాని అప్రమత్తమయ్యారు. ప్రవీణ్ బిగ్గరగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు స్పందించి చెడ్డీ గ్యాంగ్‌కు చెందిన ఓ దొంగను పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు. దొంగకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దొంగలు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారుగా స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.
వరుసగా చోరీలు
గతం నెలలో కూడా తిరుపతికి దొంగల భయం పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ చెడ్డీ గ్యాంగ్ ముఠా వరుసగా చోరీలు చేశారు. నగరంలో వరస దొంగతాలు చోటుచేసుకోవటంతో దొంగల్ని పట్టుకునేందుకు పోలీసులకు సవాల్‌గా మారింది. అయితే.. చెడ్డీ గ్యాంగ్ మరోసారి కుప్పం సిటీలోకి వచ్చారన్న వార్త ప్రజల్లో కంగారు పుట్టిస్తోంది. గతంలో చెడ్డీ గ్యాంగ్ చేసిన దోపిడీలు చూస్తే కుప్పం ప్రజల్లో వణుకు పుడుతోంది. సిటీలోకి వచ్చి చెడ్డీ గ్యాంగ్ దొంగతనాలు చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నారు. అర్ధరాత్రి దాటాక అపార్టమెంట్లో చోరీలు చేస్తున్నారు. టెంపుల్ సిటీలో పోలీసులకు కొత్త సవాళ్లు విసురుతున్న చెడ్డీ గ్యాంగ్. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో దొంగలు జనాన్ని అడలెత్తిస్తున్నారు. వరుసగా చోరీలు జరుగుతున్నాయి. ఇప్పటికే జనం వణికి పోతుంటే సీటిలోకి చెడ్డి గ్యాంగ్ ఎంటర్ అయిందన్న వార్తతో ప్రజలను మరింత భయాందోళనకు గురవుతున్నారు.
ఇళ్లలోకి చొరబడి దోచుకుంటున్న చెడ్డీ గ్యాంగ్
అయితే.. ఈ చెడ్డీ గ్యాంగ్ చరిత్ర తెలిస్తే ఇంట్లో భయం ఆవహించక మానదు. గతంలో తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ సృష్టించిన బీభత్సం అంతా అంతా కాదు. సైలెంట్‌గా వచ్చి టార్గెట్‌ని ఫినిష్ చేయడమే చెడ్డీ గ్యాంగ్ స్టైల్. కుప్పం దొంగల భయంతో వణుకుతుంటే.. పోలీసులకు సవాల్‌గా మారింది. ఒంటి మీద బట్టలు కూడా లేకుండా ఇళ్లలోకి చొరబడి అందినంత దోచుకోవడం ఈ గ్యాంగ్ పనితీరు. అర్ధరాత్రి దొంగతనం చేయడంలో వీరుని మించిన వారు లేరు.. ఏవరైనా అడ్డు వచ్చినా.. వారిని ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. రాజస్థాన్‌కి చెందిన ఈ ముఠాలు తెలుగు రాష్ట్రాల్లో అనేక చోరీలు చేశారు. అంతేకాకుండా అనేక జిల్లాల్లో కూడా చోరీలు చేసి పోలీసులకు సవాల్ విసిరారు. కానీ ఈ చెడ్డీ గ్యాంగ్ ఎక్కడా పోలీసులకు చిక్కిన దాఖలాలు లేవు. అలాంటి చెడ్డీ గ్యాంగ్ కన్ను ఇప్పుడు కుప్పంపై పడింది.
ఇది కూడా చదవండి: రాహుల్.. ప్రియాంకపై పోస్టర్ల కలకలం..వేషగాళ్లు అవసరమా అంటూ విమర్శలు