Chandrayan-2 Took Photos Of Apollo Landing Place: చంద్రయాన్-2…ఇది చంద్రుని చుట్టూ నాలుగేళ్లుగా తిరుగుతూనే ఉంది. అప్పటి నుంచి ఎన్నో చంద్ర మిషన్లకు మార్గదర్శకంగా కూడా పని చేసింది. 2023లో చంద్రయాన్-3 ల్యాండింగ్‌కు కూడా చంద్రయాన్-2 మార్గం సుగమం చేసింది. దీంతో పాటూ ఇది చంద్రుని చుట్టూ తిరుగుతూ దానికి పంబంధించి ఎన్నో లక్షణాలను, విశేషాలను భారత్‌కు అందించింది. ఇందులో ఒకటి నీల్ ఆర్మ స్ట్రాంగ్ చంద్రుని మీద అడుగు పెట్టిన ప్రదేశం. 2021లో చంద్రయాన్-2 తీసిన ఫోటోలలో దీనిని కనుగొన్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.
1969లో నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుని మీద అడుగుపెట్టారు. అపోలో 11 మిషన్ ద్వారా ఈయన చంద్రుని మీదకు చేరుకున్నారు. మూన్ ఉపరితలం అయిన ట్రాంక్విలిటీ దక్షిణ భాగంలో అపోలో-11 దిగింది. ఇది అంతకు ముందు 1967లో చంద్రుని మీద దిగిన మానవరహిత అంతరిక్ష నౌక ల్యాండింగ్ సైట్ దగ్గరలోనే ఉంది. ఇప్పుడు ఇదే ప్రదేశాన్ని చంద్రయాన్-2 ఫోటోలు తీసింది. వీటిని మార్టి మెక్‌గ్యురే ఆర్బిటర్ హై-రిజల్యూషన్ కెమెరా(OHRC) తో తీసింది. చంద్రుని ఉపరితం మీద నుంచి 100కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అపోలో 11, అపోలో 12 ల్యాండింగ్ పైట్ల చిత్రాలను చిత్రీకరించింది చంద్రయాన్-2. వీటిని ఇస్రో శాస్త్రవేత్తలు తమ తదుపరి పరిశోధనల కోసం ఉపయోగించనున్నారు. wఈ OHRC కెమెరా ప్రత్యే సెన్సార్లతో ఉంటుంది. అంతరిక్షంలో రెండు వేర్వేరు ప్రదేశాల నుంచి ఒకే స్థలం ఫోటో తీయగల వ్యవస్థతో కూడా ఉంటుంది. ఈ కెమెరాతో 12*3 కి.మీ విస్తీర్ణాన్ని చాలా వివరంగా చూడవచ్చును.
చంద్రయాన్-3 లోని విక్రమ్ చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో ల్యాండింగ్ చేయడానికి అనువుగా ల్యాండింగ్ స్పాట్‌ను కనుగొనడానికి చంద్రయాన్-2 ఆర్బిటర్‌ను ఇస్రో ఉపయోగించింది. ఇది జపాన్ స్లిమ్ మిషన్‌కు కూడా సహాయపడింది. 2024లో చంద్రునిపై దిగిన మొదటి జపనీస్ అంతరిక్ష నౌకగా స్లిమ్ మిషన్ నిలిచింది. చంద్రయాన్-2 మిషన్‌ను 2019లో ఇస్రో చంద్రునిపైకి ప్రయోగించింది. ఇది ఆర్బిటర్లలో ఇప్పటికీ పని చేస్తున్నప్పటికీ..దీని ల్యాండర్, రోవర్ మాత్రం చంద్రుని మీద హార్డ్‌గా దిగడంతో ఫెయిల్ అయిపోయాయి.
Also Read:ISRO: ఇస్రో ఖాతాలో మరో ఘనత..రీయూజబుల్ వాహనం ల్యాండింగ్ విజయవంతం