Allu Arjun : టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్, మంచు లక్ష్మీల (Manchu laxmi) మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. ఎల్లప్పుడూ సోషల్ మీడియా వేదికగా యాక్టివ్ గా ఉండే వీరిద్దరూ ఓ ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్ పోస్టుతో అభిమానులను అలరించారు. కొత్త ఏడాది సందర్భంగా మంచు లక్ష్మీకి అదరిపోయే టాస్క్ (Task) ఇచ్చారు అల్లు అర్జున్.
నెల రోజుల ఛాలెంజ్..
ఈ మేరకు మంచు లక్ష్మీ న్యూ ఇయర్ లో తాను పెట్టుకున్న గోల్స్ ఏమిటో పబ్లిక్ తో షేర్ చేసుకోవాలని బన్నీ సూచించాడు. అంతేకాదు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అందరితో షేర్ చేసుకున్న నటుడు.. ఒక నెల పాటు అన్నం, నాన్ వెజ్ తినకుండా ఉండాలని లక్ష్మీకి ఛాలెంజ్ విసిరాడు. అయితే దీనిపై పాజిటీవ్ గా స్పందించిన ఆమె.. ఆయన సవాల్ ను అంగీకరిస్తున్నట్లు తెలిపింది. ‘ఈ నెలలో రైస్, నాన్ వెజ్ కు దూరంగా ఉండాలని అనుకుంటున్నా. ఇదే నా గోల్. నిజానికి ఈ రెండూ లేకుండా నేను ఉండలేను. రైస్, నాన్ వెజ్ రెండూ నా ఫేవరెట్’ అని లక్ష్మీ పేర్కొన్నారు. అయితే ఈ ఛాలెంజ్ స్వీకరించినందువల్ల వాటికి దూరంగా ఉంటానని, ఇక మీదట ఏం జరుగుతుందో చూడాలంటూ పోస్ట్ పెట్టింది. ఈ పోస్టుకు రిప్లై ఇచ్చిన బన్నీ.. మంచు లక్ష్మీ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. వీరిద్దరి సవాల్ లో ఎవరూ పైచేయి సాధిస్తారో చూడాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : Jhanvi Kapoor: కళ్లు బాగున్నాయంటూనే నా వక్షోజాలను చూస్తారు.. జాన్వీ బోల్డ్ కామెంట్స్
ఇక ‘పుష్ప’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా భారీ పాపులారిటీ దక్కించుకున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం ‘పుష్ప 2’లో నటిస్తున్నారు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక మంచు లక్ష్మి ‘ఆదిపర్వం’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీకి సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్నారు.