Mobile Towers : మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థలో ‘శాటిలైట్’ కనెక్టివిటీ(Satellite Connectivity) కి సంబంధించి చైనా(China) శాస్త్రవేత్తలు నూతన ఆవిష్కరణకు తెరలేపారు. ఇక నుంచి సెల్ టవర్లు(Cell Towers) అవసరం లేకుండానే ఫోన్లలో మాట్లాడుకోవచ్చని చైనా శాస్త్రవేత్తలు అంటున్నారు. తాజాగా టియాంటాంగ్-1 సిరీస్‌కు చెందిన మరో శాటిలైట్‌ను చైనా నింగిలోకి పంపింది. ఈ ప్రయోగం అనంతరం చైనా సైంటిస్టులు ఈ విషయాన్ని వెల్లడించారు. తాజాగా చేపట్టిన ప్రయోగం విజయవంతం కావడంతో దీనితో కలిపి చైనా.. మూడు టియాంటాంగ్-1 సిరీస్ ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపింది.
Also read: అధికారంలోకి వస్తే.. పశ్చిమ యూపీని ప్రత్యేక రాష్ట్రం చేస్తాం: మాయావతి
అంతేకాదు ఇది ఆసియా – పసిపిక్ ప్రాంతం అంతటా మొబైల్ శాటిలైట్ కనెక్టవిటీకి మార్గం సుగమం చేసిందని.. భూకంపాలు, తుఫానులు వంటివి వచ్చినప్పుడు ‘శాటిలైట్ కనెక్టివిటీ’ కీలక పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇదిలాఉండగా.. ప్రపంచంలో మొదటిసారిగా Huawei కంపెనీ శాటిలైట్ కనెక్టివిటీకి సపోర్ట్ చేసే స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చింది. ఆ తర్వాత Xiaomi, Honor, Oppo స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఈ జాబితాలో చేరాయి.
Also read: బీజేపీ మేనిఫెస్టోపై మల్లిఖార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు…