Weddings 2023 : ఈ రోజుతో 2023కు వీడ్కోలు పలికి రేపు 2024 స్వాగతం పలికేందుకు అందరూ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ యేడాది తమకు మిగిల్చిన గుడ్ అండ్ బ్యాడ్ మూమెంట్స్ ను స్మరించుకుంటూ నూతన సంవత్సరంలో అంతా మంచే జరగాలనే కోరుకుంటున్నారు. అయితే కొంతకాలంగా ప్రేమలో ఉంటూ జనాల్లో క్యూరియాసిటీ పెంచిన సెలబ్రిటీ(Celebrities) ల గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. దాదాపు రెండు, మూడేళ్లుగా డేటింగ్ చేసిన చాలామంది సినీ సెలబ్రిటీలు వివాహాబంధంతో ఒక్కటయ్యారు. వరుణ్-లావణ్య, శర్వానంద్-రక్షితా రెడ్డి, మంచు మనోజ్- భూమా మౌనిక లాంటి తెలుగు నటులతోపాటు పరిణీతి చోప్రా- రాఘవ లాంటి బాలీవుడ్, పొలిటికల్ లీడర్స్ కూడా ఉన్నారు.
ఈ మేరకు మెగా ఫ్యామిలీకి చెందిన వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల పెళ్లి నవంబర్ 1న ఇటలీలోని టుస్కానీలో ఘనంగా జరిగింది. మాదాపూర్‌లో నవంబర్ 5న రిసెప్షన్ వేడుక జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. ఇదిలావుంటే వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక విడాకుల ఇష్యూ ఈ యేడాది చర్చనీయాంశమైంది.
View this post on Instagram
మంచు మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్- భూమా మౌనికల పెళ్లి మార్చి 3న హైదరాబాద్‌లోని మంచు లక్ష్మిప్రసన్న ఇంట్లో ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనిక మెడలో మూడు ముళ్లు వేసి ఆమెతో కొత్త జీవితం ప్రారంభించాడు మనోజ్. భూమా మౌనిక ఇప్పటికే ఒక కొడుకు ఉండగా.. నాలుగేళ్ల ప్రేమ తర్వాత పెళ్లితో ఒక్కటైంది ఈ జంట.
View this post on Instagram
యంగ్ హీరో శర్వానంద్-రక్షితా రెడ్డిల పెళ్లి జూన్ 2న జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో వైభవంగా జరిగింది. నిశ్చితార్థం జరిగిన ఆరు నెలల తర్వాత పెళ్లిబంధంతో ఒక్కటవగా.. ఈ పెళ్లికి రామ్ చరణ్‌తో పాటు పలువురు టాలీవుడ్ సినీ, రాజకీయ నాయకులు హాజరయ్యారు.
View this post on Instagram
ఈ సంవత్సరం ప్రత్యేకంగా చెప్పుకునే పెళ్లిల్లో ఇండియన్ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టిలది ఒకటి. సీనియర్ నటుడు సునీల్ శెట్టి కూతురైన అతియా శెట్టి-రాహుల పెళ్లి.. ఖండాలాలోని సునీల్ శెట్టి బంగ్లాలో జనవరి 23న సింపుల్ గా జరిగింది. ఈ వివాహానికి సినీ తారలు, క్రికెటర్లు పాల్గొన్నారు.
టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా.. సెర్బియాకు చెందిన నటి, మోడల్ అయిన నటాషా స్టాంకోవిచ్‌ను పెళ్లి చేసుకున్నాడు. నిశ్చితార్థంతోనే ఓ బిడ్డకు తండ్రి కూడా అయిన పాండ్యా.. 2023 ఫిబ్రవరి 14న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో నటాషా స్టాంకోవిచ్‌ను బంధువుల సమక్షంలో ఘనంగా చేసుకున్నాడు.
We celebrated Valentine’s Day on this island of love by renewing the vows we took three years ago. We are truly blessed to have our family and friends with us to celebrate our love ❤️ pic.twitter.com/tJAGGqnoN1
— hardik pandya (@hardikpandya7) February 14, 2023
బాలీవుడ్ నటులు కియారా అద్వానీ(Kiara Advani)- సిద్ధార్థ్ మల్హోత్రా సైతం ఈ ఏడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. షేర్షా చిత్రం ద్వారా పరిచయమైన వీరిద్దరి స్నేహం ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత కొన్నేళ్లపాటు డేటింగ్ కొనసాగించారు. 2023 ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. అలాగే ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా- బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాల పెళ్లి 2023 సెప్టెంబర్ 24న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని లీలా ప్యాలెస్‌లో జరిగింది. వీరిపెళ్లికి బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారై సందడి చేశారు.