Hyderabad: హైదరాబాద్ గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదైంది. ప్రిసైడింగ్ అధికారితో దురుసుగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు అందడంతో మంగళహట్ పీఎస్ లో ఎఫ్ఐఆర్ ధాఖలు చేశారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
case registered
K. E. Gnanavel Raja : పని మనిషికి వేధింపులు.. ‘సింగం’ నిర్మాతపై కేసు నమోదు!
Chennai : ఇంటి పని మనిషిని వేధించిన కేసులో సినీ నిర్మాత జ్ఞానవేల్ రాజా(Gnanavel Raja) పై కేసు నమోదైంది. జ్ఞానవేల్ భార్య నేహా(Neha) కారణంగానే తమ ఇంట్లో విధులు నిర్వర్తించే మహిళా ఆత్మహత్యాయత్నం(Suicide) చేసుకున్నట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు జ్ఞానవేల్, నేహాలపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Salman khan: కాల్పుల ఎఫెక్ట్.. ఇల్లు మారుతున్న సల్లుభాయ్!
అసలేం జరగిందంటే..
చెన్నైలోని త్యాగరాయ నగర్‌లోని జగదీశ్వరన్ వీధిలో నిర్మాత జ్ఞానవేల్ రాజా, భార్య నేహా ఉంటున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం తమ ఇంట్లో కొన్ని బంగారం ఆభరణాలు కనిపించకుండా పోయాయి. దీంతో పని మనిషి లక్ష్మిని ప్రశ్నించింది నేహా. దీంతో మనస్థాపం చెందిన లక్ష్మి పనికి రావడం మానేసింది. ఫోన్ కూడా స్విచ్ఛ్ ఆఫ్ చేసుకుంది. దీంతో మరింత అనుమానం పెంచుకున్న నేహా.. లక్ష్మి ఇలా చేసిందంటూ భర్తకు వివరించింది నేహా. దీంతో వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు జ్ఞానవేల్. అయితే లక్ష్మిని విచారణకు పిలవగా.. పరువు పోయినట్లు భావించిన లక్ష్మి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు ఆమె కూతురు నిర్మాత జ్ఞానవేల్, నేహాపై పోలీసులకు కంప్లైట్ చేయగా కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
AP: వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నానిపై కేసు నమోదు!
YCP MLA NANI: వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నానిపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా 144 సెక్షన్ అతిక్రమించి మంగళవారం వైసీపీ అనుచరులతో దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ కానిస్టేబుల్ హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో చిలకలపూడి పీఎస్ లో ఐపీసీ 188, 143,427 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఫర్నిచర్ ధ్వంసం చేసినందుకుగానూ సెక్షన్ 427 కింద పేర్ని నానితోపాటు మరికొంత మందిపై కేసు ఫైల్ చేశారు.
BRS: బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్‌పై కేసు నమోదు!
Telangana: కేసీఆర్ ఫ్యామిలీ, బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎంపీ సంతోష్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-14లో ఫోర్జరీ డాక్యూమెంట్లతో భూమి కబ్జా చేశారంటూ నవయుగ కంపెనీ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సంతోష్ పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్లు చెప్పారు. ఇప్పటికే కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసుతో మరోసారి కేసీఆర్ కు కంటిమీద కునుకు లేకుండా పోతుందని పార్టీ వర్గాలు వాపోతున్నాయి.