Car Accident In US : నేటి యువతరం చేతికి బైక్, కారు దొరికిందంటే చాలు రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకుపోతున్నారు. నిరంతరం రద్దీగా ఉండే రోడ్లపై వేగంగా వాహనాలను నడుపుతూ ఫోజులు కొడుతున్నారు. అయితే కొన్నిసార్లు వాళ్ల సరదా తీర్చుకోవడం కోసం ఇతరుల ప్రాణాలను లెక్కచేయకుండా వ్యవహరిస్తున్నారు. కావాల్సినదానికంటే వేగంగా నడపడంతోపాటు నడిరోడ్లు, ఫ్లై ఓవర్లపై స్కూటీ, బైకులతో స్టంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు ప్రాణాలు కొల్పోతున్నారు. ఇలాంటి భయంకరమైన సంఘటనే యూఎస్ లో చోటుచేసుకోగా ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
A Colorado Springs “street takeover” ends about as well as you would expect. pic.twitter.com/jXVdnNU8bk
— Ian Miles Cheong (@stillgray) December 18, 2023
ఈ మేరకు ఓ యువతి తన స్నేహితులతో కలిసి కారులో పార్టీకి వెళ్లగా.. అక్కడ తన డ్రైవింగ్ ఫర్మార్మెన్స్ చూపించుకోవాలనుకుని దారుణంగా విఫలమైన ఘటన యూఎస్ కొలరాడో స్ప్రింగ్స్(Colorado Springs) లోని ఓ మాల్ దగ్గర జరిగింది. హోటల్ పార్కింగ్ ప్రాంతంలో ఓ యువతి కొంతమంది ఫ్రెండ్స్ ను ఎక్కించుకుని ఎస్యూవీ కారు(SUV Car) ను ప్రమాదకరంగా నడపింది. అయితే ఆ కారును వెననకు రివర్స్ తీసేందుకు ప్లాన్ చేయగా వేగంగా కట్ కొట్టాలనుకుంది. దీంతో అదుపుతప్పిన కారు ఒక్కసారిగా పల్టీ కొట్టింది. దీంతో అందులో ఉన్న ఐదుగురు యువతీ యువకులు ఆ కారు డోర్లపై వేలాడారు. మరికొందరు కారు కింద పడి నలిగిపోయారు. వెంటనే అక్కడున్న వారంతా పరిగెత్తుకొచ్చి కారును పైకి లేపి వాళ్లందరినీ కాపాడి హస్పిటల్ తరలించారు. ఇప్పటి వరకూ ఎవరూ మరణించలేదని పోలీసులు వెల్లడించారు. మద్యం మత్తులోని ఈ చర్యకు పాల్పడ్డారనే కోణంలో విచారిస్తున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి : కొవిడ్ పై రాజకీయం చేయొద్దు.. అప్రమత్తంగా ఉండండి: కేంద్రం కీలక సూచన
ఇక ఇందుకు సంబంధించిన తంతంగాన్ని ఓ యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. ఈ ప్రమాదంపై స్పందించిన కొలరాడో స్పింగ్స్ పోలీసులు.. ఈ దారుణానికి పాల్పడిన ఆ యువతి నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసినందుకు పలు కేసు నమోదు చేసి అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.