శీతాకాలం వచ్చేసింది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్ాయి. చల్లి వాతావరణానికి ప్రజలు వెచ్చని దుస్తువులు, అలవాట్లలో మార్పులు చేసుకుంటున్నారు. అయితే మన కార్లు, బైకులు కూడా మెయింటైన్ చేసేందుకు కొన్ని సాధారణ చిట్కాలు కూడా అనుసరించడం ముఖ్యం. ఈ చలికాలంలో మీరు కారును మెయింటైన్ చేయడంతోపాటు ఇంకా ఎక్కువ మైలేజీని అందించడంలో మీకు సహాయపడే 5 టిప్స్ ను ఇప్పుడు చూద్దాం.
టైర్ ప్రెజర్:
మైలేజీకి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశాన్ని విస్మరిస్తుంటాం. అదే టైర్ ప్రెజర్. ఉష్ణోగ్రతలు పడిపోతున్నప్పుడు టైర్ ప్రజెర్ కూడా పడిపోతుంది. దీనివల్ల ఫ్యూయల్ సిస్టంపై ప్రభావం పడుతుంది. తయారీదారుల సిఫార్సుల ప్రకారం మీ టైర్ ప్రజెర్ క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి. తగినంత గాలి ప్రెజర్ నుంచి మంచి మైలేజీని అందించడమే కాకుండా చల్లని రోడ్డు, మంచు రోడ్లపై కూడా పట్టును పెంచుతుంది.
డ్రైవింగ్ అలవాట్లు:
శీతాకాలంలో వేగంగా డ్రైవింగ్ చేయడమనేది మైలేజీకి హానికరం. అనవసరమైన స్పీడ్ కాకుండా…ఎకానమీ స్పీడ్ పాటించడం మంచిది. అకస్మాత్తుగా ఆగి, హైస్పీడ్ తో కారును స్టార్ట్ చేయడం ద్వారా ఎక్కువ ఇంధనం ఉపయోగిస్తుంది. ఇంకా మీ వాహనంపై అదనపు ఒత్తిడి కలుగుతుంది. సాఫ్ట్ డ్రైవింగ్ స్టయిల్ మెరుగైన మైలేజీకి దోహదపడుతుంది.
ఇంజన్ వేడెక్కడం:
మీ కారుతో రోడ్డుపైకి వచ్చే ముందు హీట్ చేయడం చాలా మంచిది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మోడ్రన్ ఇంజన్లు వేడెక్కుతాయి. ఐడిల్ సమయాన్ని లిమిట్ చేయడం..ఇంజన్ దాని ఉష్ణోగ్రతకు చేరుకునే వరకు కొన్ని నిమిషాల పాటు నెమ్మదిగా డ్రైవ్ చేయండి. ఈ విధానం ఇందధనాన్ని ఆదా చేయడమే కాకుండా మీరు ఇంజన్ లైఫ్ ను కూడా పెంచుతుంది.
సరైన ఆయిల్:
శీతాకాలపు వాతావరణానికి అనుకూలంగా సరైన ఇంజిన్ ఆయిల్ ను ఎంచుకోవడం వల్ల మైలేజీపై ప్రభావం చూపుతుంది. మందపాటి ఆయిల్ రెసిస్టెన్స్ ను పెంచుతుంది. మీ వాహనం మాన్యువల్ ప్రకారం వింటర్ గ్రేడ్ ఆయిల్ కు మారండం మంచిది. దీనివల్ల ఇంజన్ పనితీరుకూడా పెరుగుతుంది.
బరువు:
మీ వాహనంలో అవసరమైన బరువును పెట్టడం వల్ల ఇంధన వినియోగం పెరుగుతుంది. మీ కారును నిర్వహించేందుకు కొంత సమయం కేటాయించండి. మీకు అవసరం లేని వాటిని ముఖ్యంగా భారీవస్తువులను ఉంచకూడదు. అదనపు బరువు ఉంటే మీ ఇంజనక్ ఎక్కువ భారం అవుతుంది. దీని వల్ల మైలేజీ తగ్గుతుంది.
ఈ టిప్స్ పాటించడం వల్ల చలికాలంలో మీ కారు ఇంధన కెపాసిటీకి నిజమైన తేడా ఉంటుంది. టైర్ గాలి, డ్రైవింట్ అలవాట్లు, ఇంజన్ వార్మప్ పద్దతులు, ఆయిల్ సెలేషన్, ఎక్కువ బరువును తగ్గించడం వంటివి మీరు శీతాకాలం సవాళ్లను ఎదుర్కొవచ్చు. పెట్రోల్ లేదా డీజిల్ ఖర్చులను అదుపులో ఉంచుకోవచ్చు.
ఇది కూడా చదవండి: ఈ చిన్న టిప్స్ పాటిస్తే మీ ఇంట్లో నుంచి బొద్దింకలు పరార్!