Burger in Guinness: లక్షల విలువ చేసే ఓ బర్గర్ సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తోంది. ఈ బర్గర్ ధర 5 లక్షల రూపాయలు. ఇప్పుడు అది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పేజీలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బర్గర్‌గా స్థానం సంపాదించుకుంది . ఈ వీడియో స్వతహా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. నెటిజన్లు దీని ధరను చూసి ఆశ్చర్యపోతున్నారు.
ఈ ప్రత్యేకమైన బర్గర్‌ను డచ్ చెఫ్ రాబర్ట్ జాన్ డి వీన్ తయారు చేశారు మరియు ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బర్గర్‌గా గెల్డర్ల్యాండ్లోని వూర్తుయిజెన్లోని డాల్టన్స్ రెస్టారెంట్ మెనూలో ఉంది. టాపింగ్ పూర్తిగా బంగారు పూతతో ఉంది. ఈ బర్గర్‌కు ‘ది గోల్డెన్ బాయ్’ అని పేరు పెట్టారు. దీని ధర $5,967 అంటే భారత కరెన్సీలో రూ.4,97,813.
ఈ వీడియో జూన్ 19న @guinnessworldrecords Instagram ఖాతాలో షేర్ చేశారు. షేర్ చేసిన ఒక్కరోజులోనే ఈ వీడియోకు మూడు లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. అంతేకాకుండా 11 వేల మందికి పైగా వీడియో లైక్స్ ద్వారా తమ అభినందనలు తెలియజేసారు.
View this post on Instagram