Charles – 3 : బ్రిటన్ రాజు ఛార్లెస్-3(Charles-3) క్యాన్సర్ బారిన పడ్డారు. దీనికి సంబంధించిన ప్రకటన ఒకటి విడుదల చేసింది బకింగ్ హామ్ ప్యాలెస్. చార్లెస్-3 క్యాన్సర్(Cancer) బారిన పడ్డారు. ఇది కూడి తాజాగా బయటపడిందని బకింగ్ హ్యామ్ పాలెస్(Buckingham Palace) చెబుతోంది. ప్రోస్టేట్ పెరగడంతో చికిత్స తీసుకుంటుండగా క్యాన్సర్ విషయం బయటపడిందని చెప్పింది. అయితే ఇది ఏరకమైన క్యాన్సర్ అన్నది ఇంకా తెలియలేదని చెబుతున్నారు. అయితే చికిత్సకు సంబంధించిన అన్ని మొదలుపెట్టారని…అది పూర్తయిన వెంటనే విధుల్లోకి వస్తారని తెలిపింది.
Also Read : Warangal:ఈ నెల 15 నుంచి 25 వరకు మేడారం జాతరలో ఉచిత వైఫై
ప్రస్తుతం చార్లెస్ బహిరంగ క్యార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన హాజరయ్యే కార్యక్రమాలకు ఇతర సీనియర్ రాజకుటుంబీకులు హాజరవుతారని ఫ్యాలెస్ తెలిపింది. దీని మీద అన్ని దేశాలకు సంబంధించిన నేతలు స్పందిస్తున్నారు. మీరు త్వరగా కోలుకోవాలి. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారనడంలో నాకు ఎటుంవటి సందేహం లేదు అంటూ ఎక్స్(X) లో పోస్ట్ చేశారు బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్(British PM Rishi Sunak). ఈయనతో పాటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో, బ్రిటన్ మాజీ ప్రధానులు లిజ్ ట్రస్, బోరిస్ జాన్సన్, సర్ టోనీ బ్లెయిర్ కూడా ఎక్స్‌లో తమ స్పందనలను పోస్ట్ చేశారు.
2022లో ఛార్లెస్-3 బ్రిటన్ రాజుగా ఎంపిక అయ్యారు. తన తల్లి క్వీన్ ఎలిజిబెత్-2(Queen Elizabeth-2) చనిపోయక ఆయనను రాజుగా ప్రకటించారు. ఏడు దశాబ్దాలకుపైగా సుదీర్ఘ కాలంపాటు బ్రిటన్ను క్వీన్ ఎలిజబెత్-2 పాలించారు. చార్లెస్-3 1981లో లేడీ డయానా స్పెన్సర్‌ను పెళ్లి చేసుకున్నారు. 1996 జులైలో చార్లెస్, డయానా విడాకులు తీసుకున్నారు. వీరికీ ఇద్దరు కొడుకులు. విలియం, హ్యారీ లే వాళ్ళిద్దరు. ప్యారిస్ లో 1997లో జరిగిన కారు ప్రమాదంలో డయానా మరణించిన తర్వాత ఆయన 2005లో ఛార్లెస్-3 ..కామిలా పార్కర్ బౌల్స్‌ను రెండో వివాహం చేసుకున్నారు.
Also Read : పనికిరావన్న వారితోనే పల్లకీ మోయించుకున్న గాన లత