Bubonic Plague in US: చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎలా అతలాకుతలం చేసిందో అందిరికీ తెలిసిందే. ఎక్కువ కేసులు నమోదయ్యింది అమెరికాలోనే. అయితే ఇప్పుడు అగ్రరాజ్యాన్ని మరో ప్రమాదకర వ్యాధి బయటపడం కలకలం రేపింది. 8 సంవత్సరాల తర్వాత ఈ వ్యాధి మళ్లీ రావడం ఇదే మొదటిసారి. అదే బ్లుబోనిక్ ప్లేగ్ (Bubonic Plague). ఇది జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది. అలాగే మనుషుల నుంచి మనుషులకు కూడా సోకుతుంది.
Also Read: ఎన్నికల ఫలితాలు విడుదల.. ఇమ్రాన్ అభ్యర్థులకే ఎక్కువ సీట్లు
పిల్లి నుంచి సోకిన వ్యాధి
తాజాగా ఒరెగాన్ స్టేట్లో (Oregon State) తొలి పాజిటివ్ కేసు నమోదైంది. అక్కడ నివసిస్తున్న ఓ వ్యక్తి పిల్లిని పెంచుకుంటున్నాడు. దాని నుంచే ఆ వ్యక్తికి ఈ ప్లేగ్ వ్యాధి సోకినట్లు ‘యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెంట్‘ తెలిపింది. దీంతో ఈ వ్యాధి విస్తరించకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే అమెరికా పశ్చిమ ప్రాంత రాష్ట్రాల్లో అధికంగా ఈ ప్లేగ్ వ్యాధి వ్యాపిస్తుంటుంది.
8 ఏళ్ల క్రితం వెలుగుచూసిన వ్యాధి
2016లో న్యూ మెక్సికో, నార్తర్న్ అరిజోనా, సదరన్ కొలరాడో, కాలిఫోర్నియా, సదరన్ ఒరెగాన్, నెవడాల్లో పలువురు ఈ వ్యాధికి గురయ్యారు. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కవ కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. దీన్ని నివారించగలిగామని అప్పట్లో అమెరికా తెలిపింది. కానీ ఇప్పుడు మళ్లీ ఒరెగాన్ స్టేట్లో ఇది బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. సెంట్రల్ ఒరెగాన్లోని.. డెశాటె కంట్రీలో ఈ బ్యుబోనిక్ ప్లేగ్ వ్యాధి బయటపడినట్లు ది న్యూయార్క్ పోస్ట్ తెలిపింది.
Also Read: ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి 20 మందిపై సామూహిక అత్యాచారం