Bubblegum Song: టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల తనయుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న మొదటి చిత్రం ‘బబుల్ గమ్’. ఈ సినిమాకు రవికాంత్ దర్శకత్వం వహించారు. రవికాంత్ ‘క్షణం’ సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టారు. మొదటి సినిమాకే బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నంది అవార్డు పొందారు. ప్రస్తుతం ‘బబుల్ గమ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ‘బబుల్ గమ్’ ట్రైలర్ యువతను ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమా డిసెంబర్ 28న థియేటర్స్ లో విడుదల కానుంది.
Also Read: Maa Oori Polimera 2 on OTT: ఓటీటీలో ‘మా ఊరి పొలిమేర 2’ రికార్డ్.. 100 మిలియన్ వ్యూవింగ్ మినిట్స్..!
ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం సినిమా నుంచి ‘జస్ట్ ఈజీ పీజీ’ అనే రొమాంటిక్ సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా.. రవికాంత్ పెరుపు లిరిక్స్ రాసారు. అంబిక, శ్రావణ్ చక్రవర్తి పాటను పాడారు. ఇప్పటికే ‘బబుల్ గమ్’ నుంచి విడుదలైన ‘హబీబీ జిలేబీ’ పాటకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘బబుల్ గమ్’ సినిమాలో హర్షచెముడు, కిరణ్ మచ్చా, అను హాసన్, చైతు జొన్నలగడ్డ, బిందు చంద్రమౌళి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. రోషన్ కనకాలతో పాటు సుమ కూడా మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీమ్ పలు టీవీ షోస్, ఇంటర్వ్యూస్ లో పాల్గొంటుంది.
Also Read: Bubblegum Trailer : రోషన్ కనకాల ‘బబుల్ గమ్’ ట్రైలర్ వచ్చేసింది