Viral video: బీహార్లో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన చోటుచేసుకుంది. సరన్ నగరంలో మంగళవారం రాత్రి స్థానిక ప్రజలు ఘనంగా నిర్వహించిన మహావీర్ మేళా సంగీత కార్యక్రమంలో కనురెప్పపాటులో ఓ ఇంటి బాల్కని కుప్ప కూలిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 100 మందికి పైగా గాయపడగా 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివారాలు ఇలా ఉన్నాయి.
आर्केस्ट्रा नाच देखने के दौरान बिहार के छपरा में हादसा
इशुआपुर में महावीर मेला के दौरान करकटनुमा छज्जे पर खड़े होकर आर्केस्ट्रा देख रहे लोग अचानक गिर पड़े#Bihar #accident pic.twitter.com/KSSDfBeCVQ
— Thakur Divya Prakash (@Divyaprakas8) September 4, 2024
ఈ మేరకు ఛప్రా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సరన్ జిల్లాలో మంగళవారం రాత్రి ఇషావ్పూర్ బ్లాక్లో మహావీర్ అఖారా ఊరేగింపు జరిగింది. ఈ వేడుకకు వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. అక్కడి నిర్వహించే ప్రదర్శనలు చూసేందుకు జనం ఎగబడ్డారు. అయితే రొడ్డుపక్కనున్న ఓ బిల్డింగ్ పైకి దాదాపు వందమంది ఎక్కి చూస్తున్నారు. ఇప్పటికే శిథిలావస్థకు చేరిన ఆ ఇంటి బాల్కనీలో వారి బరువుకు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఏం జరిగిందో అర్థం కాకపోవడంతో జనం అరుపులు పెడుతూ పరిగెత్తారు. దీంతో తొక్కిసలాట జరిగింది. వందలాది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీడియో వైరల్ అవుతోంది.