భారతదేశంలో హిందీ వాళ్ళు డామినేట్ చేయడం ఈరోజు మొదలైంది కాదు. దీని కోసం చాలా తరాలు, ఏళ్ళ బట్టి పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఇండియా అంటే కేవలం హిందీ మాట్లాడేవాళ్ళే కాదు…ఇంకా చాలా మంది ఉన్నారంటూ ఫైట్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా దీనికోసం తమిళ్ వాళ్ళు చాలా గట్టిగా పోరాడారు, పోరాడుతూనే ఉన్నారు. తాజాగా ఈ పోరాటంలో తాను ఉన్నానని అంటున్నారు సద్గురు జగ్గీవాసుదేవ్. భారతదేశం అంటే హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు ఉన్న భాషల సముదాయమని…హిందుస్తాన్ అంటే హిందీ భూమి కాదని చెప్పారు సద్గురు జగ్గీవాసుదేవ్.
Also read:గోదావరిలోకి దూకిన నవదంపతులు..భార్య మృతి, భర్త సేఫ్
నిన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేసిన వాఖ్యలే సద్గురు మాటలకు కారణం అయ్యాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాడమే లక్ష్యంగా ‘INDIA‘ కూటమి పార్టీలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఈ కూటమిలో బీజేపీ(BJP) ని వ్యతిరేకించే పార్టీలన్ని ఉన్నాయి. ఇందులో దక్షిణాది పార్టీల ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. ఎందుకటే బీజేపీకి దక్షిణాదిన ప్రస్తుతం ఒక రాష్ట్రం కూడా లేదు. సహజంగా హిందీ భాష రుద్దుడుపై వ్యతిరేకంగా ఉండే తమిళ పార్టీలు INDIA కూటమీలో భాగంగా నార్త్ పార్టీలతో కలిసి పనిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే నాలుగో సారి ఈ కూటమి భేటీ అవ్వగా..ఈ మీటింగ్‌లో బీహార్ సీఎం నితీశ్‌కుమార్ నోరుపారేసుకున్నారు.
బీహార్ సీఎం నితీష్ కుమార్(Nitish Kumar) దక్షిణాది ప్రతినిధులతో జరిగిన కూటమి సమావేశంలో పాల్గొన్నారు. ఈ మీటింగ్‌లో మాట్లాడుతుండగా.. మిత్రపక్షమైన డీఎంకే హిందీలో చేసిన ఆయన ప్రసంగానికి అనువాదం కావాలని కోరింది. డీఎంకే సీనియర్ నాయకుడు టీఆర్ బాలుతో పాటు అక్కడున్న మిగిలిన వారికి నితీశ్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. అందుకే అనువాదం కోసం రాష్ట్రీయ జనతాదళ్ ఎంపి మనోజ్ కె ఝాకు సంకేతాలు ఇచ్చారు. బాలుకు సహాయం చేయడానికి, ఝా నితీష్ కుమార్ నుంచి అనుమతి కోరారు. అయితే బీహార్ సీఎం సహనం కోల్పోయారు. ‘మేము మన దేశాన్ని హిందుస్థాన్ అని పిలుస్తాము, హిందీ మా జాతీయ భాష.. మన భాష మనకు తెలియాలి.’ అని కామెంట్స్ చేశారు. అంతటితో ఆగలేదు తన ప్రసంగాన్ని అనువదించవద్దని మనోజ్ ఝాకు నితీశ్ చెప్పడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
దీని మీదనే ఇప్పుడు సద్గురు రియాక్ట్ అయ్యారు. బీహార్ సీఎం నితీష్ భారతదేశ వైవిధ్యాన్ని గౌరవించాలని కోరారు. భాషా ప్రతిపదికన రాష్ట్రాల విభజన చేశారు. అందరికీ సమాన హోదా ఉండేలా చేశారు. కానీ హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉండడం, ఆ రాష్ట్రాలే ఎక్కువగా ఉండడం వల్ల దాన్ని మీ మీద రుద్దాలనుకోవడం మంచి విషయం కాదని చెప్పారు సద్గురు. హిందీలోనే మాట్లాడాలి, చెప్పాలి…హిందీ నేషనల్ లాంగ్వేజ్ లాంటి సామాన్య ప్రకటనలు చేయకుండా ఉంటే మంచిదని నితీశ్ కుమార్ కు సద్గురు సూచించారు. దీనికి సంబంధించి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు.