SJ Suryah About His Role In Indian 2 Movie : కోలీవుడ్ (Kollywood) స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో స్టార్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భారతీయుడు 2’. 1996 లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన మూవీ ప్రమోషనల్ కంటెంట్ భారీ అంచనాలను క్రియేట్ చేయడంతో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.
జులై 12న విడుదల కాబోతున్న ఈ సినిమాలో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, SJ సూర్య, బాబీ సింహా, వివేక్, ప్రియా భవానీ శంకర్, బ్రహ్మానందం, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. కాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న SJ సూర్య (SJ Suryah) సినిమాలో తన పాత్రకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Also Read : ‘కల్కి’ విషయంలో కొన్ని తప్పులు చేశాను : నాగ్ అశ్విన్
తాజా ఇంటర్వ్యూలో SJ సూర్య మాట్లాడుతూ..”ఈ సినిమాలో నేను తెరపై కనిపించేది కొద్దిసేపే కావచ్చు. కానీ, ఆ సన్నివేశాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ‘గేమ్‌ఛేంజర్’లో తన నటన చూసి ‘భారతీయుడు2’లో అవకాశం ఇచ్చారు. రామ్ చరణ్‌తో కలిసి చేసిన కొన్ని సన్నివేశాలను చూసిన శంకర్ నాకు ‘ఇండియన్ 2’లో విలన్ పాత్ర పోషించే అవకాశమిచ్చారు. ఇది నట జీవితంలోనే ఎప్పటికీ మర్చిపోలేని పాత్రల్లో ఒకటి” అని అన్నాడు.