Bharateeyudu 2 Movie : యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా సెన్షేషనల్ డైరెక్టర్ శంకర్ తెరెకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. జులై 12 న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఆడియన్స్ ను అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే ఈ మూవీని ఓటీటీలో చూసేందుకు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో తాజాగా మేకర్స్ నుంచి ఓటీటీ అప్డేట్ వచ్చింది.
ఆగస్టు 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో
తాజా సమాచారం ప్రకారం, ‘భారతీయుడు 2’ చిత్రం ఆగస్టు 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.
Thatha varaaru, kadhara vida poraaru 🔥#Indian2 is coming to Netflix on 9 August in Tamil, Telugu, Malayalam and Kannada!#Indian2OnNetflix pic.twitter.com/cJN0JWaprp
— Netflix India South (@Netflix_INSouth) August 4, 2024
Also Read : వయనాడ్ బాధితులకు అల్లు అర్జున్ సాయం.. రూ. 25 లక్షల విరాళం
రూ. 200 కోట్లకు ఓటీటీ రైట్స్
ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సంస్థ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. సుమారు రూ. 200 కోట్లకు ఈ రైట్స్‌ను దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్, ఇండియన్ 2తో పాటు ఇండియన్ 3 చిత్రాల రైట్స్ కూడా సొంతం చేసుకుంది.