Bhairava Dweepam Trailer: 1994లో సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasa Rao) దర్శకత్వం వహించిన ఈ ఎవర్గ్రీన్ ఫాంటసీ ఎంటర్టైనర్…క్లాప్ ఇన్ఫోటైన్మెంట్ ద్వారా గ్రాండ్‌గా రీ-రిలీజ్ అవుతోంది. ప్రేక్షకులకు మెమరబుల్ సినిమాటిక్ అనుభూతిని అందించి, బాక్సాఫీస్ వద్ద అద్భుతాలను సృష్టించిన ఈ చిత్రం.. అప్‌గ్రేడ్ చేసిన 4కె క్వాలిటీతో ఆగస్ట్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, బాబీ (కెఎస్ రవీంద్ర), గోపీచంద్ మలినేని తాజాగా ఆదిత్య మ్యూజిక్(Aditya Music)లో రీ-రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ తరం ప్రేక్షకులకు థియేటర్లలో అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని పంచబోతుందని ట్రైలర్ భరోసా ఇచ్చింది.
విజువల్ వండర్
క్లాప్స్ ఇన్ఫోటైన్మెంట్ పివి గిరి రాజు, పి దేవ్ వర్మ ‘భైరవద్వీపం’ రీ-రిలీజ్‌తో ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించనున్నారు. బాలకృష్ణ (Bala Krishna) ఒక తెగలో పెరుగుతున్న రాకుమారుడు విజయ్‌గా ధైర్యసాహసాలు కలిగిన వీరుడిగా కనిపిస్తారు. విజయ్, కార్తికేయ రాజ్యానికి చెందిన యువరాణి ప్రేమలో పడతారు. ఒక దుష్ట మాంత్రికుడు, యువరాణిని బలి ఇవ్వడానికి ‘భైరవ ద్వీపం’ అనే ద్వీపానికి మాయాజాలం ద్వారా తీసుకువెళ్తాడు. విజయ్ చెడుతో పోరాడి, యువరాణిని ఎలా కాపాడతాడు అనేది ఈ సినిమా స్టోరీ. గొప్ప మలుపులు, అద్భుతమైన దృశ్యాలతో కూడిన విజువల్ వండర్ ‘భైరవ ద్వీపం’.
రావి కొండల రావు రాసిన ఈ కథకు, దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు స్వయంగా అద్భుతమైన స్క్రీన్ ప్లేని అందించారు. మాధవపెద్ది సురేష్ అందించిన సంగీతం మరో హైలైట్.ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ కబీర్ లాల్. చందమామ విజయ కంబైన్స్ బ్యానర్‌పై నిర్మాత బి. వెంకటరామి రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.
Also Read: అర్థరాత్రి సమంతకు విజయ్ దేవరకొండ వీడియోకాల్.. ఎందుకంటే? వైరల్ వీడియో