Bhairava Anthem From Kalki 2898AD : పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas) యాక్ట్ చేసిన తొలి సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి2898AD’ మరో 10 రోజుల్లో రిలీజ్ కాబోతుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమా నుంచి ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ చూస్తున్నట్లు ఇటీవలే మేకర్స్ పోస్టర్ తో ప్రకటించారు.‘ఇండియా బిగ్గెస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది వేచి ఉండండి అంటూ కల్కి టీమ్ సాంగ్ పై ఒక్కసారిగా హైప్ పెంచేసింది.
ఇక చెప్పినట్లుగానే నేడు ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ భైరవ యాంథెమ్ ఫుల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఇక ఈ పాటను ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసంజ్ (Diljit Dosanjh) పాడాడు. సంతోశ్ నారాయణ్ (Santhosh Narayanan) సంగీతం అందించాడు. ‘భైరవ ఆంథమ్’ పేరుతో రిలీజైన ఈ సాంగ్ తెలుగు విత్ పంజాబీ లిరిక్స్ తో మిక్స్ అయి ఉంది. ఇక సాంగ్ లో ప్రభాస్ లుక్స్ చాలా స్టైలిష్ గా ఉన్నాయి.
Also Read : ‘పుష్ప 2’ కోసం రోజువారీగా రెమ్యునరేషన్.. నిర్మాతలకు ఫహాద్ ఫాజిల్ వింత కండీషన్?
ముఖ్యంగా సాంగ్ చివర్లో ప్రభాస్ పంజాబీ లుక్ లో అదిరిపోయాడు. అదే లుక్ లో పంచె ఎత్తి అలా స్టైల్ గా నడుచుకుంటూ వెళ్తున్న విజువల్స్ డార్లింగ్స్ ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా ‘భైరవ ఆంథమ్’ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచింది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలు పోషించారు.ఈనెల 27న ఈ సినిమా గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కానుంది.