Samyuktha Menon Pairing With Bellamkonda Srinivas : టాలీవుడ్(Tollywood) లో అతి తక్కువ సమయంలో హీరోయిన్ గా స్టార్ ఇమేజ్ అందుకున్న వారిలో సంయుక్త మీనన్(Samyuktha Menon) కూడా ఒకరు. పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయం అయిన సంయుక్త మీనన్ మొదటి సినిమాతోనే తన నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకుంది.
ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. గత ఏడాది ‘విరూపాక్ష’ మూవీలో తన స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది. ప్రెజెంట్ టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ పేరుతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఓ ప్లాప్ హీరోతో జోడి కట్టబోతోందట. ఇంతకీ ఎవరా? ప్లాప్ హీరో?..
Also Read : సింగర్ నల్గొండ ‘గద్దర్’ నర్సన్నఫేస్ బుక్ హ్యాక్?
బెల్లం బాబుతో సంయుక్త మీనన్
సంయుక్త మీనన్ ప్రస్తుతం నిఖిల్(Nikhil) స్వయంభూ’ మూవీతో పాటూ శర్వానంద్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. అయితే తాజాగా ఈ అమ్మడి వద్దకి మరో ప్రాజెక్ట్ వచ్చి చేరిందట. లేటెస్ట్ ఫిలిం నగర్ రిపోర్ట్ ప్రకారం.. బెల్లం కొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) హీరోగా మూన్ షైన్ పిక్చర్స్ పతాకంపై ఓ సినిమా తెరకెక్కనుంది.
ఈ సినిమా కోసం హీరోయిన్ గా సంయుక్త మీనన్ పేరును చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే మేకర్స్ సంయక్తతో సంప్రదింపులు జరిపారని, సంయుక్త కూడా ఈ ప్రాజెక్ట్ విషయంలో సానుకూలంగా ఉందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో మొదలు కానున్నట్లు సమాచారం.