Modi to attend BJP BC Sabha: ప్రధాన పార్టీలన్నీ తమ అగ్ర నేతలతో ప్రచార సభలను పెడుతున్నాయి. రాహుల్, ప్రియాంకలు ఇప్పటికే ఒకసారి వచ్చి వెళ్ళారు. మళ్ళీ అక్టోబర్ 15 తరువాత వస్తారని తెలుస్తోంది. ఇప్పుడు బీజేపీ కూడా ఇందుకు సిద్ధమైంది. రేపు తమ అధినేతను హైదరాబాద్ (Hyderabad) కు తీసుకువస్తోంది. మంగళవారం తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ (PM Modi) పాల్గొననున్నారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో బీసీ గర్జన సభలో మోదీ పాల్గొననున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 5.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఎల్బీనగర్ స్టేడియంలో (LB Stadium) జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
Also Read:గాజాలో శరణార్ధుల శిబిరాల మీద ఇజ్రాయెల్ దాడి..73మంది మృతి
తెలంగాణ ఎన్నికల సందడి మొదలయ్యాక బీజేపీ తరుఫున ఇంత పెద్ద సభ జరగడం ఇదే మొదటిసారి. అది కూడా ప్రధాని రావడం కూడా ఇదే తొలిసారి. దీంతో అంతటా ఈ సభ మీద ఆసక్తి నెలకొంది. బీజేపీ (BJP) కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. లక్ష మందిని సభకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభ కోసం పార్టీ ఒక ప్రత్యేక ప్రతినిధుల బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. మోదీ రాకతో తమ నేతల్లో ఉత్సాహం వస్తుందని…అలాగే తమ ఎజెండాను కూడా ప్రకటిస్తామని చెబుతున్నారు బీజేపీ నేతలు.
తాజాగా కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah) సూర్యాపేట సభలో తెలంగాణలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి బీసీ (BC CM) అని ప్రకటించారు. ఇదే విషయాన్ని బీజేపీ నేతలు అస్త్రంగా వాడి ప్రజల్లోకి వెళ్ళాలని కూడా అనుకుంటున్నారు. తెలంగాణలో మెజారిటీ ఓటర్లు బీసీలే ఉన్నారు. అందుకే బీజేపీ ఇదే పంథాను వాడుకుని ముందుకు వెళ్ళాలని గట్టిగా డిసైడ్ అయ్యింది. తెలంగాణలో ఉన్న బీసీలను అన్ని పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని…ఎవ్వరూ అధికారం ఇవ్వడానికి ముందుకు రావడం లేదని బీజేపీ అంటోంది. బీసీలు అధికారంలోకి రావాలంటే అది ఒక్క బీజేపీ వల్లనే సాధ్యమవుతుందని చెబుతున్నారు. నవంబర్ 7న హైదరాబాద్ లో నిర్వహించే బీసీ గర్జన సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తారని తెలుస్తోంది ఇందులో ఎలాంటి అంశాలు, హామీలు ఇస్తారనే అంశాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.
Also Read: గెలుపే లక్ష్యం.. ఈ నెల 15 నుంచి తెలంగాణలోనే రాహుల్, ప్రియాంక మకాం!