Blakrishna Golden Jubilee: బాలయ్య సినీ ఇండస్ట్రీలో 50 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఆయన స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. నిన్న హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో జరిగిన ఈ వేడుకలకు బాలయ్య ఫ్యామిలీ తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోల నుంచి అగ్రతారల వరకు బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలో పాల్గొని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేశారు. చిరంజీవి, వెంకటేష్, కమల్ హాసన్, రజినీకాంత్, రాఘవేంద్రరావు, మోహన్ బాబు, రానా , నాని, మంచు మనోజ్, మురళీమోహన్, విజయేంద్ర ప్రసాద్, అశ్వినీదత్, సుహాసిని, మంచు విష్ణు, మాలశ్రీ, మైత్రీ మూవీమేకర్స్ నిర్మాతలు, నవీన్, రవిశంకర్, గోపీచంద్, బోయపాటి శ్రీను, పి.వాసు, జయసుధ కుటుంబం, విశ్వక్ సేన్ బాలయ్య సహా పలువురు తారలు బాలయ్య వేడుకల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా సినీ తారలు బాలయ్య సినీ ప్రస్థానం గురించి మాట్లాడారు.
కమల్ హాసన్ మాట్లాడుతూ.. సంస్కారం వల్ల అందరూ గుర్తుపెట్టుకుని వ్యక్తి నందమూరి బాలయ్య. బాలయ్య అంటే స్వచ్ఛమైన మనసు, స్వేచ్ఛగా ఉండే తత్వం అని ఆయన గురించి గొప్పగా వ్యాఖ్యానించారు.
వెంకటేష్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ గారి కుటుంబం నుంచి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు బాలయ్య. ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. 50 సంవత్సరాల ఆయన సినీ ప్రయాణం ఎంతో మంది కొత్త వారికి ఆదర్శం. ‘ఫ్లూట్ జింక ముందు కాదు, సింహం ముందు కాదు’ అంటూ బాలయ్య పై తన అభిమానాన్ని చాటారు.
RARE MOMENT : Ragahvendra Rao Dancing 🔥🕺#NandamuriBalakrishna #NBK50inTFI pic.twitter.com/rVKR5TLMRV
— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) September 1, 2024
A legendary duo sharing smiles and memories. 🥰
Priceless candid moments between #Balayya Garu and #Chiranjeevi Garu at the #NBK50YearsCelebrations! 🔥💥#NandamuriBalakrishna #NBK50inTFI #NBKGoldenJubilee #NBKGoldenJubilee #NBK50YearsCelebrations #NBK109… pic.twitter.com/1zcRt6DdbS
— Ragalahari (@Ragalahariteam) September 1, 2024
The timeless SUPERSTARS who continue to rule hearts and the box office. 📸🔥#NandamuriBalakrishna #NBK50inTFI #Balayya #NBK50YearsCelebrations #Chiranjeevi #Venkatesh #NBKGoldenJubilee #NBKGoldenJubilee #NBK50YearsCelebrations #NBK109 #50YearsOfUnstoppableJourney #Ragalahari pic.twitter.com/KivzaHZSJw
— Ragalahari (@Ragalahariteam) September 1, 2024
Also Read: Chandrababu : సారీ బాలయ్య.. చంద్రబాబు ఎమోషనల్ పోస్ట్! – Rtvlive.com