Balak Ram Temple:అయోద్యలో బాలరాముని ప్రతిష్ట జరిగి 11 రోజులు గడిచింది. జనవరి 23 నుంచి సామాన్య భక్తులకు ఆలయ సందర్శనం ఇచ్చారు. మొదటి రోజు నుంచి బాలరాముడిని చూడ్డానికి భక్తులు క్యూలు కట్టారు. దీంతో అక్కడ భారీగా రద్దీ కూడా ఏర్పడింది. నిత్యం జనాలతో అయోధ్య కిటకిటలాడుతోంది. మొదటి రోజున వీఐపీలకు మాత్రమే అనుమతి ఉండటం వల్ల సామాన్య భక్తులందరూ అక్కడే బస చేసి మర్నాడు ఉదయమే 3 గంటలకే రాముడిని దర్శించుకోవడానికి పోటీలు పడ్డారు.
Also Read:L.K. Advani:రాజకీయ కురువృద్ధుడు.. రాజనీతిజ్ఞడు ఎల్.కె. అద్వానీ
దాదాపు 12 కోట్ల ఆదాయం..
గడిచిన పదకొండు రోజుల్లో అయోధ్య బాలరామునికి దాదాపు 12 కోట్ల విరాళాలు అందాయి. జనవరి 22న ప్రాణ ప్రతిష్టకు మాజయిన వివిష్ట అతిధులే బారీ విరాళాలు సమర్పించారు. ఆఒక్క రోజునే రామ్ లల్లా 3.17 కోట్ల విరాళాలు అందుకున్నాడు. తరువాత ఆలయ సందర్శనం చేస్తున్న భక్తులు కూడా అయోధ్య ఆలయం హుండీలో భారీగానే కానుకలు సమర్పించుకుంటున్నారు. బాలరాముడ్ని గత 11 రోజుల్లో 25 లక్షల మంది దర్శించుకున్నారని, విరాళాలు రూ.11.5 కోట్లు దాటాయని ఆలయ ట్రస్ట్ అధికారులు తెలిపారు. నగదు, ఆన్ లైన్, చెక్కుల రూపంలో ఈ విరాళాలు వచ్చాయని వివరించారు.
#Donations worth ₹11 crore in 11 days & 25L devotees since temple #consecration
According to #RamJanmabhoomiTeerthKshetra, about ₹8 crore has been deposited in the donation boxes in the last 10 days, and around ₹3.50 crore was received online.https://t.co/Twpn96G16R— Ashok Malik (@ashokmalik) February 1, 2024
ఏడాది పొడవునా ఉత్సవాలు..
అయోధ్య రామాలయంలో ఏడాది పొడవునా ఉత్పవాలు జరిపించాలని ఆలయ అధికారులు నిశ్చయించారు. ఇందులో ఫిబ్రవరి 14న జరిగే వసంత పంచమి ఉత్సవమే రామాలయంలో మొదటిది కానుంది. ఆరోజు ఆలయంలో ఉన్న సరస్వతీ దేవిని పూజించనున్నారు. దాంతో పాటూ సాంస్కృతికి కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. ఇక ఏడాది మొత్తం కలిపి 12 ప్రధాన పండుగలు, ఉత్సవాలు జరుగుతాయని ఆలయ అధికారులు చెబుతున్నారు.
సందర్శన వేళలు…
బాల రాముని విగ్రహాన్ని చూసేందుకు భక్తులు ప్రతిరోజూ రెండు సమయాలలో – ఉదయం 7 నుండి 11:30 వరకు, మరియు మధ్యాహ్నం 2 నుండి 7 గంటల వరకు – రామమందిరాన్ని సందర్శించవచ్చు. స్వామి వారికి రోజుకు ఆరుసార్లు హారతి కార్యక్రమాన్ని ఇవ్వనున్నట్లు ట్రస్ట్ పూజారులు వివరించారు. మంగళ, శ్రింగార, భోగ, ఉతపన్, సంధ్యా, శయన హారతి ఇస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే స్వామివారికి నిత్యం సమర్పించే నైవేథ్యం గురించి కూడా వారు వివరించారు.
నైవేద్యంలో పూరీ, కూర..
స్వామి వారికి సమర్పించే నైవేధ్యంలో(Prasad) పూరీ, కూర తో పాటు పాలు, పండ్లు, రబ్ డీ ఖీర్, పాలతో చేసిన స్వీట్లను నైవేధ్యంగా సమర్పిస్తామని తెలిపారు. మంగళవారం నుంచి రాముల వారిని దర్శించుకోవడానికి సామాన్య ప్రజలను అనుమతించారు.దీంతో, ఆలయం దేశం నలుమూలల నుంచి వచ్చిన రామ భక్తులతో కిటకిటలాడుతోంది.