Gun Firing In badlapur Railway Station: మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఉన్న బద్లాపూర్ రైల్వే స్టేషన్లో ఈరోజు సాయంకాలం జరిగిన కాల్పులు భయభ్రాంతులను కలిగించాయి. గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ఇందులో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. దుండగుడు మరిన్ని కాల్పులు జరిపే లోపు వెంటనే అప్రమత్తమయిన పోలీసులు అతడిని లొంగదీసుకున్నారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
అయితే నిందితుడు కాల్పులు ఎందుకు జరిపాడు, అతను ఎవరు అన్న వివరాలు ఇంకా తెలియలేదు. ఇది కేవలం వ్యక్తిగత కక్షా లేక దీని వెనుక ఉగ్రవాద కోణం ఏమైనా ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్ రైల్వే) సహా సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.