Baby Movie 3 Weeks Collections : చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకుంది బేబి. సాయిరాజేష్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) హీరోహీరోయిన్లుగా నటించారు. ఎస్కేఎన్ నిర్మించాడు. ఈ సినిమాకు మొదటి వారం మంచి టాక్ రావడం ఒకెత్తయితే.. రెండో వారం ముగిసేంత వరకు సినిమాకు ఏకథాటిగా ప్రచారం చేయడం మరో ఎత్తు.
రెండో వారంలో ఏకంగా చిరంజీవిని (Chiranjeevi) కూడా తీసుకొచ్చి ప్రచారం చేశారు. దీంతో బేబి సినిమాకు నిలకడగా వసూళ్లు వచ్చాయి. అలా 3 వారాల రన్ పూర్తి చేసుకుంది ఈ సినిమా. విడుదలైన ఈ 21 రోజుల్లో బేబి సినిమాకు వరల్డ్ వైడ్ 76 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఇది కాసులవర్షం కురిపించింది. నిర్మాతతో పాటు, డిస్ట్రిబ్యూటర్లందరికీ ఓవర్ ఫ్లోస్ అందించింది.
ఏపీ,నైజాంలో ఈ సినిమాకు 21 రోజుల్లో 64 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చింది. ఖర్చులు, ట్యాక్సులు పోను 35 కోట్ల 39 లక్షల షేర్ వచ్చింది. పెద్ద సినిమాలకు దీటుగా నైజాంలో బేబి సినిమాకు 15 కోట్ల రూపాయలకు పైగా షేర్ రావడం చెప్పుకోదగ్గ విషయం.
ఈవారం రిలీజైన సినిమాలన్నీ ఫెయిలయ్యాయి. ప్రస్తుతం బ్రో(Bro Movie) సినిమా మాత్రమే మార్కెట్లో నడుస్తోంది. సో.. బేబి(Baby Movie) సినిమాకు మరో వారం కలిసొచ్చినట్టయింది. నాలుగో వారం కూడా ఈ సినిమాకు వసూళ్లు రావడం ఖాయం అంటోంది ట్రేడ్.
Watch Baby Movie Team Exclusive Interview:
Also Read: బ్రో మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్