Bhadradri Kothagudem District: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని సత్యనారాయణపురం (Satyanarayanapuram) సమీపంలో గల నాగుల్ మీరా చాంద్ మౌలచాన్ దర్గా (Dargah) షరీఫ్‌లో ఘనంగా అయ్యప్ప స్వాముల పడిపూజ ( Ayyappa padipuja )నిర్వహించిన దర్గా నిర్వాహకులు. ఈ దర్గా 20 సంవత్సరాల క్రితం సత్యనారాయణపురంలోని అటవీ ప్రాంతంలో దర్గా వెలసింది దర్గా..నిర్వాహకుడు ఒక హిందూ ఆయన కలలో ఈ ప్రాంతంలో దర్గాను నిర్వహించాలని దేవుడు చెప్పడంతో ఇక్కడ దర్గా ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: కివీ పండు పొట్టు సులభంగా వలిచే చిట్కాలు..మీరూ ట్రై చేయండి
దర్గాలో మాలిక్‌గా ఒక హిందువుగా ఉండడం విశేషం. రెండు సంవత్సరాలకు ఒకసారి ఘనంగా ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఉత్సవాలకు వివిధ రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు (devotees) వచ్చి లక్షలాదిగా మొక్కులు తీర్చుకుంటారు. అంతేకాదు.. రాష్ట్ర మంత్రులు (Ministers)కూడా ఇక్కడికి వచ్చి మొక్కలు తీసుకుంటారు. ఇదే క్రమంలో కులమతాలకతీతంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ దర్గాలో సీతారాముల కళ్యాణం కూడా నిర్వహించారు.
ఇది కూడా చదవండి: అల్లంతో మన ముఖంపై అద్భుతాలు.. ఒక్క ముక్క అల్లం చాలు
ఇప్పుడు అయ్యప్ప పడిపూజను నిర్వహించడంతో హిందూ ముస్లిమ్స్ (Hindu- Muslims) వచ్చి పడి పూజలో పాల్గొని దేవుని సంకీర్తనలతో మారుమోగింది. అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పడి పూజను ఘనంగా నిర్వహించుకున్నారు. దర్గా నిర్వాహకులు వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. కుల మతాలకతీతంగా అతీతంగా వివిధ మతాలకు మధ్య స్నేహభావాన్ని (Friendship) పెంచే విధంగా కార్యక్రమాలు ఉండడంతో దర్గా నిర్వాహకులను పలువురు ప్రశంసిస్తున్నారు.
ఇది కూడా చదవండి: అల్లంతో మన ముఖంపై అద్భుతాలు.. ఒక్క ముక్క అల్లం చాలు