Vijayawada: ఏపీ ప్రభుత్వం మరో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఏపీఎస్పీ బెటాలియన్ అదనపు డీజీగా పనిచేస్తున్న అతుల్ సింగ్ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీగా నియమించింది. విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ను సీఐడీ అదనపు డీజీ బాధ్యతలు అప్పగించింది. అలాగే శాంతిభద్రతల అదనపు డీజీ శంకబ్రత బాగ్చిని విశాఖ సీపీగా నియమిస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది.