రోజురోజుకు మనుషులు రాక్షసుల్లా మారిపోతున్నారు. ప్రతీ విషయానికి హింసనే ఆయుధంగా చేసుకోని ఇతరులకు నరకవేధనను మిగులుస్తున్నారు. చిన్న విషయాలకు కూడా ఇగోలకు పోయి సైకోల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఇదేం శాడిజమో అర్థంకాని దుస్థితి. జీతం అడిగితే కొడతారా? బూట్లు నాకిస్తారా? అసలు వీళ్లేం మనుషులు. విచక్షణ మరిచి బెల్టుతో చావకొట్టడమేంటి? జీతం ఎగ్గొట్టడమే కాకుండా ఈ కొరడా దెబ్బలేంటి? ఇదేం బుద్ధి? గుజరాత్(Gujarat)లో జరిగిన ఓ ఘటన గురించి చదువుతుంటే ఇంత ఘోరమా అనిపిస్తోంది.
#Gujarat A Caste Hindu businesswoman, promoter of a ceramic company in Morbi, allegedly forced a sacked Dalit sales manager lick her boots while five others lashed him with a belt as he called and messaged her to ask for his 18 days of salary. pic.twitter.com/D2bOenFtmb
— The Dalit Voice (@ambedkariteIND) November 24, 2023
ఏం జరిగింది?
గుజరాత్-మోర్బీలో ఓ సిరామిక్ కంపెనీలో గత అక్టోబర్ 2న నీలేష్ దల్సానియా అనే దళితుడు సేల్స్ మేనేజర్‌గా జాయిన్ అయ్యాడు. అయితే అతనికి జాబ్ నచ్చలేదు. యాజమాన్యం ప్రవర్తన నచ్చక అక్టోబర్ 18న రిజైన్ చేశాడు. ప్రతి నెల 5న జీతాలు ఇస్తుంది కంపెనీ. ఈ నెల 5న దల్సానియాకు జీతం పడాల్సి ఉంది. 15 రోజుల జీతం రావాలి. యాజమాన్యం రూ.12,000 చెల్లించాల్సి ఉంది. అకౌంట్ డీటెయిల్స్ కూడా తీసుకున్నారు. దీంతో తనకు శాలరీ పడుతుందని దల్సానియా వెయిట్ చేశాడు. కానీ ఈ నెల 5న జీతం పడలేదు. ఒక రెండు రోజులు ఓపిక పట్టాడు. తర్వాత కంపెనీకి కాల్ చేశాడు. సరైన సమాధానం రాలేదు.
Also Read: రోహిత్ శర్మ నాటౌటా? హెడ్ క్యాచ్‌పై సోషల్‌మీడియాలో రచ్చ..!
బూట్లు నాకించారు:
కంపెనీ నంబర్‌కు ఎన్నిసార్లు కాల్ చేసినా ఎవరు లిఫ్ట్ చేయకపోవడంతో దల్సానియా నేరుగా కంపెనీ ఓనర్ విభూతి అలియాస్ రాణిబా పటేల్‌కు కాల్ చేశారు. తనకు డబ్బులు రావాలన్న విషయాన్ని చెప్పాడు. దీంతో విభూతి కంపెనీకి వచ్చి డబ్బులు తీసుకోవాలని సూచించింది. ఇది నమ్మి కంపెనీకి వెళ్లిన దల్సానియా అక్కడ గుండాల దెబ్బలకు బలయ్యాడు. నాకే ఫోన్ చేస్తావారా… ఎంత ధైర్యం అంటూ విభూతి దల్సానియాను కొట్టింది. రౌడిలను అడ్డం పెట్టుకోని తన బూట్లు నాకించుకుంది. అంతటితో ఆగలేదు. ఐదుగురు రౌడీలతో దల్సానియాను కొట్టించింది. దల్సానియాను బెల్టుతో చావగొట్టారు రౌడీలు. ఈ విషయాన్ని దల్సానియా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దల్సానియా వీపు భాగం మొత్తం ఎర్రగా కందిపోయి ఉంది.
Also Read: బుద్ధి బయటపెట్టుకున్నారుగా.. బంగ్లా ఫ్యాన్స్ తో జాగ్రత్తగా ఉండాలి భయ్యో!
WATCH: