ఆసియా గేమ్స్ లో ఇండియన్ షూటర్స్ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. తాజాగా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో టీమ్ ఇండియా బంగారు పతకాన్ని సాధించింది. సరభ్ జోత్ సింగ్, అర్జున్ సింగ్, చీమా ఇంకా శివా నర్వాల్ లు 10 మీటర్ల టీమ్ ఈవెంట్ లో ఈ పతకాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో భారత్ ఖాతాలో 6వ గోల్డ్ మెడల్ చేరింది.
It's a team gold in the morning, what a start to day 5 ✨❤️#shooting #AsianGames2022 #AsianCup2023 #india #issbaarsaupaar pic.twitter.com/huxhUKLLyc
— Kalptaru Agarwal (@kalp_taru) September 28, 2023
షూటింగ్ లో భారత్ పతకాలు…
ఆసియా క్రీడల్లో నిన్న మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ వ్యక్తిగత విభాగంలో సిఫ్ట్ కౌర్ సమ్రా బంగారు పతకాన్ని గెలుచుకుంది. అలాగే మహిళల 25 మీటర్ల టీమ్ ఈవెంట్ లో మను బాకర్, ఈషా సింగ్, రిథమ్ సంగ్వాన్ లు గోల్డ్ ను సాధించారు. మహిళల 25 మీటర్ల పిస్టోల్ వ్యక్తిగత విభాగంలో కూడా ఈషా సింగ్ రజతాన్ని కైవసం చేసుకుంది. పురుషరుల స్కీట్ షూటింగ్ వ్యక్తిగత విభాగంలో అనంత్ జీత్ సింగ్ నరుక రజత పతక్ గెలిచాడు. మహిళల 25 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ విభాగంలో ఆషి చౌష్కీ, మనిని కౌషిక్, సిఫ్ట్ కౌర్ సమ్రా టీమ్ రజతాన్ని సొతంత చేసుకుంది. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పోజిషన్ వ్యక్తిగత విభాగంలో ఆషి చూష్కి కాంస్యం గెలుచుకుంది. పురుషుల స్కీట్ షూటింగ్ జట్టు విభాగంలో అంగద్ గుర్జోత్, అనంత్ జీత్ సింగ్ కాంస్యాన్ని సాధించారు. పురుషుల దింగే ఐఎల్సీఏ విభాగంలో విష్ణు శరవణన్ కాంస్యాన్ని దక్కించుకున్నాడు.
ఇక భారతదేశానికి ఉషు క్రీడలో మరో రజత పతకం లభించింది. గురువారం హాంగ్జౌలో జరిగిన 19వ ఆసియా క్రీడల్లో ఉషు క్రీడలో మహిళల 60 కేజీల విభాగంలో రోషిబినా దేవి నౌరెమ్ రజత పతకాన్ని గెలుచుకుంది.2010వ సంవత్సరంలో గ్వాంగ్జౌలో జరిగిన క్రీడల్లో సంధ్యారాణి దేవి తర్వాత వుషు ఫైనల్కు చేరిన రెండో భారతీయురాలు రోషిబినా.
More from Roshibina Devi’s (in red) final bout. pic.twitter.com/H9dcQEoYCv
— Team India (@WeAreTeamIndia) September 28, 2023