Arya Movie Re-release : పుష్ప(Pushpa) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బన్నీ పాన్ ఇండియా హీరో(PAN INDIA Hero) గా ఎదిగిపోయారు. ఈ సినిమాకు గానూ నేషనల్ అవార్డు(National Award) అందుకున్న తొలి సౌత్ ఇండియన్ హీరో(South Indian Hero) గా రికార్డు సృష్టించాడు. అయితే బన్నీ తన 21 ఏళ్ల సినీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను చేశారు. కానీ వాటిలో కొన్ని మాత్రం ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటిదే ‘ఆర్య’ మూవీ. ఈ సినిమాలో ఫీల్ మై లవ్ అంటూ అందరినీ లవ్ లో పడేశారు బన్నీ.
ఆర్య మూవీ
2004లో సుకుమార్, అల్లు అర్జున్(Allu Arjun) కాంబోలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా యువతను ఎంతగానో అట్రాక్ట్ చేసింది. ఇందులో బన్నీ నటన, కామెడీ అందరినీ ఫిదా చేశాయి. ఇప్పటికీ ఈ మూవీకి సెపెరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు.
ఆర్య 20 ఇయర్స్ రీయూనియన్
అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈ మూవీ నిర్మాత దిల్ రాజ్(Dil Raju) ‘ఆర్య’ గురించి ఆసక్తికర విషయాలను మాట్లాడారు. ఈ ఏడాది మే 7తో ‘ఆర్య’ రిలీజై 20 ఏళ్ళు పూర్తవుతుందని. అలాగే ఈ మూవీ కోసం వర్క్ చేసిన డైరెక్టర్ సుకుమార్, హీరో అల్లు అర్జున్ , మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ అందరూ టాప్ పొజిషన్ లో ఉన్నారని. ఈ సందర్భంగా ఆర్య 20 ఇయర్స్ రీయూనియన్ ఈవెంట్ ను సెలెబ్రేట్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. అంతే కాదు ఆర్య రీ రిలీజ్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే బన్నీ ఫ్యాన్స్ కు పండగే. మే 7న మరోసారి ‘ఆర్య’ లవ్ ను ఫీల్ అవడం ఖాయం.
Also Read : Keerthi Bhat: బిగ్బాస్ బ్యూటీకి అర్థరాత్రి మెసేజ్.. క్లిక్ చేయగానే రూ.2లక్షలు ఫసక్.. ఏం జరిగిందంటే?
We are planning to conduct #Arya Reunion Meet on May 07, marking the 20th anniversary.
– #DilRaju pic.twitter.com/OXReGcmYbB
— Gulte (@GulteOfficial) March 30, 2024
Also Read : Heeramandi: 1000 డ్రోన్లు.. కళ్ళు జిగేలుమనేలా.. ‘హీరమండి’ రిలీజ్ డేట్ రివీల్