Arjun Kapoor – Malaika Arora Breakup : బాలీవుడ్ లవ్ బర్డ్స్ బ్రేకప్ చేసుకున్నారట. ప్రెజెంట్ ఈ న్యూస్ బీ టౌన్ లో మారు మోగిపోతుంది. కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తూ విచ్చలవిడిగా తిరిగిన అర్జున్ కపూర్ – మలైకా అరోరా బ్రేకప్ చెప్పుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారని బాలీవుడ్ అంతటా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ఈ లవ్ బర్డ్స్ ఎందుకు విడిపోయారు? పూర్తి వివరాల్లోకి వెళితే..
బ్రేకప్ అయినా ఆ స్థానం ఎప్పటికీ అలాగే..
నేషనల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. ఇండస్ట్రీ కి చెందిన ఓ వ్యక్తి అర్జున్, మలైకా ల బ్రేకప్ పై స్పందిస్తూ..” అర్జున్, మలైకా మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది. బ్రేకప్ తర్వాత కూడా వాళ్ళు ఆ బంధాన్ని కంటిన్యూ చేస్తారు. ఒకరి మనసులో ఒకరికి ప్రత్యేక స్థానం అలాగే ఉంటుంది. బ్రేకప్ గురించి మాట్లాడేందుకు వాళ్ళు సముఖంగా లేరు. దీని గురించి చర్చ జరగడం కూడా వాళ్లకు ఇష్టం లేదు” అని తెలిపాడు.
Also Read : ‘ఉప్పెన’ డైరెక్టర్ ఇంట్లో తీవ్ర విషాదం..!
కాగా 2019 లో అర్జున్ కపూర్ – మలైకా అరోరా రిలేషన్ లో ఉన్నట్లు తెలిపారు. అప్పట్నుంచి బయట పార్టీలు, ఫంక్షన్స్ అని విచ్చలవిడిగా తిరుగుతూ వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండేవారు. అంతేకాదు అర్జున్ కపూర్ మలైకా కంటే 12 ఏళ్ళు చిన్నవాడు.
ఈ విషయంలో మలైకా పై పలు విమర్శలు రావడంతో ప్రేమకి వయసుతో పనేంటని గట్టిగా కౌంటర్ ఇచ్చింది. సుమారు 5ఏళ్ల పాటూ డేటింగ్ లో ఉన్న ఈ జంట ఇదే ఏడాది పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఆ మధ్య న్యూస్ వచ్చింది. అలాంటిది ఉన్నట్టుండి ఇలా బ్రేకప్ చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.