Salman Khan To Relocate?: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఇంటి వద్ద గుర్తు తెలియని దుండగులు ఇటీవల కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై వెంటనే యాక్షన్ మొదలుపెట్టిన మహారాష్ట్ర గవర్నమెంట్ సల్మాన్ కు మరింత భద్రత పెంచింది. అయితే గత కొంతకాలంగా ఇలాంటి గొడవలతో ఇబ్బంది పడుతున్న సల్లుభాయ్.. మొత్తంగా అక్కడినుంచి మరో చోటుకు మారలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే కొత్త ఇంటికి మారబోతున్నట్లు సన్నిహిత వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Hope to see u tomorrow ….@KarateCombat#AsimZaidi@visitdubai pic.twitter.com/ZWwcYAte9l
— Salman Khan (@BeingSalmanKhan) April 19, 2024
ఇంటి నుంచి బయటకు రాలేకపోతున్నాం..
ఈ మేరకు గత కొన్నేళ్లుగా ఉంటున్న గెలాక్సీని వీడిచి మరో చోటుకు వెళ్లబోతున్నారని చర్చ జోరుగా నడుస్తోంది. అయితే దీనిపై స్పందించిన సల్మాన్ సోదరుడు అర్భజ్ఖాన్.. ‘మేము ఇల్లు మారినంత మాత్రాన బెదిరింపులు ఆగిపోతాయని మీరు భావిస్తున్నారా? ఒకవేళ అదే జరిగితే వేరే ప్రాంతానికి మారడంలో తప్పులేదు. కానీ ఇప్పుడే కాదు. ఎన్నోఏళ్ల నుంచి మా నాన్న ఆ ఇంట్లోనే ఉంటున్నారు. సల్మాన్ సైతం ఇక్కడే ఉంటున్నారు. అది వారికి బాగా నచ్చిన ఇల్లు. అలాంటి ఇంటిని ఖాళీ చేసి వెళ్లమని చెప్పలేం. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఒక్కటే చేయగలరు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన సెక్యురిటీతో ఉన్నంతలో జాగ్రత్తగా ఉండటమే కాకుండా సాధారణంగా ఉండాలి. బెదిరింపుల భయంతో జీవిస్తే ప్రయోజనం ఏమీ లేదు. కానీ ఇంటి నుంచి బయటకు రాలేకపోతున్నాం’ అంటూ క్లారిటీ ఇచ్చాడు.
ఇది కూడా చదవండి: Renu Desai: చాలా కాలం తర్వాత ఒక స్ట్రాంగ్ ఉమెన్ ను చూశా.. బీజేపీ అభ్యర్థిపై నటి ప్రశంసలు!
ఇక ఏప్రిల్ 14 తెల్లవారుజామున బాంద్రా ప్రాంతంలో సల్మాన్ ఉండే గెలాక్సీ అపార్ట్మెంట్స్ (Galaxy Apartment) వద్ద ఇద్దరు గుర్తుతెలియని దుండగులు మోటారు సైకిల్‌పై వచ్చి 4 రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు పోలీసులు.